Miryalaguda : ఎమ్మెల్యే బిఎల్ఆర్ హామీ.. మిర్యాలగూడలో త్వరలో సిగ్నల్ లైట్స్ ఏర్పాటు..!
మిర్యాలగూడ పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు త్వరలో సిగ్నల్ లైట్స్ ఏర్పాటు చేయనున్నట్లు స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు

Miryalaguda : ఎమ్మెల్యే బిఎల్ఆర్ హామీ.. మిర్యాలగూడలో త్వరలో సిగ్నల్ లైట్స్ ఏర్పాటు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు త్వరలో సిగ్నల్ లైట్స్ ఏర్పాటు చేయనున్నట్లు స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. గురువారం మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ ఎస్ పి క్యాంప్ గ్రౌండ్ లో మిర్యాలగూడ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలలో భాగంగా అరైవ్ , అలైవ్ కార్యక్రమంల నిర్వహించారు.
శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, సబ్ కలెక్టర్, అమిత్ నారాయణ, డి ఎస్ పి రాజశేఖర్ రాజు, మిర్యాలగూడ ఆటో యూనియన్, లారీ అసోసియేషన్, విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణంలో ఒకే ప్రధాన రహదారి కావడంలో పట్టణంలో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉందన్నారు. ఈ సమస్యను నియంత్రించి ప్రమాదాలు అరికట్టెందుకు త్వరలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయనునట్టు తెలిపారు. హెల్మెట్స్ ధరించి ప్రమాదాలు జరగకుండా తమ ప్రణాలను భద్రంగా ఉంచుకోవాలని అన్నారు.










