తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

Miryalaguda : మిర్యాలగూడలో ప్లాస్టిక్ కవర్స్ నిషేధించేందుకు ప్రమాణం చేయించిన ఎమ్మెల్యే..!

Miryalaguda : మిర్యాలగూడలో ప్లాస్టిక్ కవర్స్ నిషేధించేందుకు ప్రమాణం చేయించిన ఎమ్మెల్యే..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్లాస్టిక్ కవర్స్ నిషేధం పై స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి దృష్టి సారించారు. ఆయన ప్రత్యేకంగా నిర్వహించే నేను నా మిర్యాలగూడ కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ కవర్స్ నిషేధం పారిశుద్ధ్యం పై దృష్టి పెట్టారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్లాస్టిక్ కవర్స్ ను నిషేధించాలని పిలుపునిచ్చారు. ఆ తర్వాత విక్రయదారులతో సమావేశం సైతం నిర్వహించారు.

బుధవారం మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న స్వచ్ఛంద సంస్థలు రాజకీయ నాయకులతో ప్రమాణం చేయించారు. ప్లాస్టిక్ కవర్స్ ను ఉపయోగించమని ఇకపై వాటిని నిషేధిస్తామని ప్రమాణం చేయించారు.

ఘనంగా గాంధీ జయంతి

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మహాత్మా గాంధీ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆయన క్యాంపు కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం సాగర్ రోడ్డులోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన గాంధీ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సాగర్ రోడ్డులోని గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ప్లాస్టిక్ కవర్స్ నిషేధం పై కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరితో ప్లాస్టిక్ కవర్స్ నిషేధించడం పై ప్రమాణం చేయించారు. అనంతరం స్వచ్ఛ మిర్యాలగూడ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్ , కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిరుమర్రి కృష్ణయ్య, గాయం ఉపేందర్ రెడ్డి, ముదిరెడ్డి నర్సిరెడ్డి, స్కైలాబ్ నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిల శ్రీనివాస్, తమడబోయిన అర్జున్, శాగ జలంధర్ రెడ్డి, దేశిడి శేఖర్ రెడ్డి, తలకొప్పుల సైదులు
తదితరులు పాల్గొన్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు