Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Miryalaguda : విధేయతకు వరించిన ఏంఎల్సీ..!

Miryalaguda : విధేయతకు వరించిన ఏంఎల్సీ..!

మిర్యాలగూడ, మన సాక్షి:

చిన్నప్పటి నుండీ పార్టీని నమ్ముకొని వున్నాడు. పార్టీ అంటే ప్రాణం అదే అతనికి ఏంఎల్సీ కి కావడానికి కారణం. పార్టీనే నమ్ముకొని పెద్దలు జానారెడ్డికి విదేయుడిగా కొనసాగడం కలిసి వచ్చింది.

దామరచర్ల మండలం కేతవత్ తండాకు చెందిన కేతవత్ శంకర్ నాయక్ ఏప్రిల్ 15,1972 లో వీర్య నాయక్, హంస్లి దంపతులకు జన్మించాడు. విద్యార్ది దశ నుండే కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులు అయ్యాడు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేసి 1998 నుండి 2001 వరకు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2001 లో జనరల్ స్థానం నుంచి జడ్పీటీసీ ఎంపికయై 2006వరకు పని చేసి చేశారు.

2006 నుండి 2011వరకు జనరల్ స్థానాల్లో ఎంపిపిగా ఎంపికై పనిచేశారు.2011 నుంచి 2014వరకు మిర్యాలగూడ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పనిచేశారు.మళ్ళీ 2014నుంచి 2019వరకు జడ్పీటీసీగా పని చేశారు.

2016నుంచి 2019 వరకు మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. 2019 నుండి ఇప్పటి వరకు నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా పని చేస్తున్నారు. అదేవిధంగా 2014నుండి 2019 వరకు జిల్లా ప్లానింగ్ కమిటి సభ్యుడిగా పనిచేశారు.

ఆయన ఎంపిక పట్ల యూత్ కాంగ్రెస్, విద్యార్ది సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ రాజీవ్ చౌక్, శంకర్ నాయక్ ఇంటి వద్ద బాణా సంచా పేల్చి హర్షం వ్యక్తం చేశారు.

MOST READ : 

  1. Chandra Grahanam : హోలీ నాడు చంద్రగ్రహణం, ఈ రాశులకి కష్టాలే.. గ్రహదోష పరిహారాలు..!

  2. Ration Cards : రేషన్ కార్డులపై బిగ్ ట్విస్ట్.. లేటెస్ట్ అప్డేట్..!

  3. District collector : LRS ఫీజులు 25% రాయితీ.. సద్వినియోగం చేసుకోండి.. జిల్లా కలెక్టర్..!

  4. Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు