Runamafi : రైతుల ఖాతాలలోకి డబ్బులు.. రెండు విడతలుగా రు.12,224 కోట్ల రుణమాఫీ, జిల్లాల వారీగా వివరాలు..!
Runamafi : రైతుల ఖాతాలలోకి డబ్బులు.. రెండు విడతలుగా రు.12,224 కోట్ల రుణమాఫీ, జిల్లాల వారీగా వివరాలు..!
మన సాక్షి , తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో రైతులకు రెండవ విడత పంట రుణాలను మాఫీ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ప్రకటించారు. రెండవ విడతలో లక్షన్నర వరకు రుణాలు తీసుకున్న రైతుల రుణమాఫీ నిధులను విడుదల చేస్తూ పలువురు రైతులకు చెక్కులు అందజేశారు. రెండవ విడత రుణమాఫీలో 6,190 కోట్లను 6,40,823 లక్షల మంది రైతులకు మాఫీ చేశారు.
మొదటి విడత రుణమాఫీ చేసిన కొద్ది రోజులకే లక్షన్నర రుణాలు ఉన్న రైతుల అప్పులను ప్రభుత్వం మాఫీ చేసింది. మొదటి విడతలో 11,34,422 మంది రైతులకు 6034 కోట్ల రూపాయలను ఈనెల 18వ తేదీన మాఫీ చేసింది. మొదటి విడతలో లక్ష రూపాయల వరకు రుణాలు ఉన్న రైతులని మాఫీ చేసింది.
కేవలం 12 రోజుల వ్యవధిలోనే లక్షన్నర రూపాయల అప్పులు ఉన్న రైతుల పంట రుణాలను మాఫీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. మూడవ దఫాలో రెండు లక్షల రూపాయల వంటలు రుణాలున్న రైతులవి ఆగస్టు 15వ తేదీ లోపు మాఫీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ఇప్పటి వరకు రెండు విడతల్లో12,224 కోట్ల రూపాయలను ప్రభుత్వం రుణమాఫీ చేసింది. రెండు విడతలుగా17,75,235 రైతుల బ్యాంకు రుణాలు మాఫీ అయ్యాయి. రెండవ విడత రుణమాఫీ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ , స్పీకర్ గడ్డం ప్రసాద్,, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
Cm Revanth Reddy : విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి భారీ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా అమలు..!
Cm Revanth Reddy : విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి భారీ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా అమలు..!
Cm Revanth Reddy : విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి భారీ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా అమలు..!