Vemulapally : వేములపల్లిలో వందకు పైగా గొర్రెలు మృతి.. కారణం అదేనా..!

Vemulapally : వేములపల్లిలో వందకు పైగా గొర్రెలు మృతి.. కారణం అదేనా..!
వేములపల్లి, మన సాక్షి
వందకు పైగా గొర్రెలు మృతి చెందిన సంఘటన నల్గొండ జిల్లా వేములపల్లిమండల కేంద్రం సమీపంలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే సూర్యాపేట జిల్లా, పెన్పహాడ్ మండలంలోని అన్నారం, అనంతరం, దోసపాడు గ్రామాలకు చెందిన ఉప్పునూతల సైదులు, శ్రీరాముల కోటయ్య, శ్రీరాముల గోపాలు ,ఆవుల కోటయ్య, ఆవుల వెంకన్న లు తమ గొర్రెలను గత కొన్ని రోజులుగా మండల కేంద్రం సమీపంలో పొలాలలో మేపుతున్నారు.
కాగా విషపు ఆహారం తినడం వలన బుధవారం రాత్రి 80 గొర్రెలు, గురువారం 40 గొర్రెలకు పైగా మృతి చెందినట్లు బాధిత రైతులు తెలిపారు. సుమారు 20 లక్షల పైగా నష్టం వాటిల్లినట్టు గొర్రెల కాపరులు వాపోయారు. భారీ సంఖ్యలో గొర్రెలు చనిపోవడంతో గొర్రెల కాపరులు రోధిస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. గొర్రెలు చనిపోవడానికి కారణం విషపు ఆహారం గాని, విషపు నీరు గాని అయ్యుండొచ్చని స్థానికులు పేర్కొంటున్నారు.
గొర్రెలను పరిశీలించిన జెడిఎ :
వేములపల్లి మండల కేంద్రంలో విషపు ఆహారం తిని మృతి చెందిన గొర్రెలను జిల్లా వ్యవసాయ అధికారి జివి రమేష్ పరిశీలించారు. పోస్టుమార్టం రిపోర్టును ల్యాబ్ కు పంపిస్తున్నట్లు తెలిపారు. ల్యాబ్ పరీక్షలు అనంతరం మృతి గల కారణాలు తెలియనున్నట్లు పేర్కొన్నారు. విషపు ఆహారమై ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు. మృతి చెందగా మిగిలిన జీవాలకు వైద్యం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట పశువైద్యాధికారులు అశోక్, జ్ఞానేశ్వర ప్రసాద్ తదితరులున్నారు.
MOST READ :
-
TG News : ప్రభుత్వ పాఠశాలల్లో 2837 కంప్యూటర్ ఉద్యోగాలు.. రూ.15 వేల వేతనం, అర్హులు వీరే..!
-
Pension : రైతులకు భారీ గుడ్ న్యూస్.. నెలకు రూ. 3000 పెన్షన్.. ఎవరు అర్హులంటే..!
-
Nalgonda : ఎరువుల దుకాణాల్లో జిల్లా వ్యవసాయ అధికారి ఆకస్మిక తనిఖీ..!
-
District collector : విద్యార్థులకు జిల్లా కలెక్టర్ కీలక సూచన.. ఆ కోర్సులను చదివితే భవిష్యత్తు ఉంటుంది..!









