తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : ఎంపీడీవో కార్యాలయానికి మున్సిపల్ నోటీస్..!

Miryalaguda : ఎంపీడీవో కార్యాలయానికి మున్సిపల్ నోటీస్..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయానికి మున్సిపల్ అధికారులు నోటీస్ జారీ చేశారు. మున్సిపల్ ఆస్తి పన్నుల బకాయిల వసూళ్లలో భాగంగా ఎక్కువ బకాయిలు, చాలాకాలంగా ఉన్నవారికి రెడ్ నోటీసులు జారీ చేస్తున్నారు. ఇటీవల మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, మున్సిపల్ కమిషనర్ యూసుఫ్ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఆస్తి పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందిని, అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా మొండి బకాయిదారుల జాబితాను తయారుచేసిన అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. కాగా ఎంపీడీవో మరియు పంచాయతీ సమితి పెండింగ్ ట్యాక్స్ 83,06,049 రూపాయలు పెండింగ్ లో ఉంది. దాంతో మున్సిపల్ అధికారులు పెండింగ్ బకాయిలు చెల్లించాలని నోటీసు జారీ చేశారు.

MOST READ : 

  1. Rythu Bharosa : రైతు భరోసా, ఆత్మీయ భరోసా అకౌంట్లోకి డబ్బులు ఎప్పుడంటే.. బిగ్ అప్డేట్..!

  2. TG News : రైతులకు భారీ షాక్.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!

  3. TG News : నిరుద్యోగులకు శుభవార్త.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు..!

  4. WhatsApp : వాట్సప్ హ్యాకర్ల నుంచి రక్షించుకోవడం ఎలా..!

మరిన్ని వార్తలు