Breaking Newsతెలంగాణ

NagarjunaSagar : నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల..!

NagarjunaSagar : నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల..!

మన సాక్షి , నాగార్జునసాగర్ :

నాగార్జునసాగర్ ఎడమ కాలువకు శుక్రవారం ఉదయం 8 గంటలకు అధికారులు నీటిని విడుదల చేశారు. తాగునీటి అవసరాల కోసం ఎడమ కాలువకు నీటిని విడుదల చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్ పూర్తిగా ఎండిపోయింది. దాంతో పాలేరు రిజర్వాయర్ పరిధిలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది.

దాంతో తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని నీటిపారుదల శాఖ అధికారులు ఎడమ కాలువకు 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. రోజుకు 1000 క్యూసెక్కుల నీటి చొప్పున విడుదల చేయనున్నారు. నాగార్జునసాగర్ జలాశయంలో డెడ్ స్టోరేజీ ఉన్నప్పటికీ కూడా ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని నీటిని విడుదల చేశారు. రోజుకు 1000 క్యూసెక్కుల నీటి చొప్పున విడుదల చేయడం వల్ల తాగునీటి అవసరాలకు పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచించారు.

ఇవి కూడా చదవండి : 

శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు.. తుంగభద్రకు భారీగా వరద, విద్యుత్ ఉత్పత్తితో సాగర్ కు నీటి విడుదల..!

కృష్ణమ్మ పరవళ్ళు.. తెరుచుకున్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల గేట్లు.. త్వరలో శ్రీశైలం, సాగర్ కు వరద..!

రూ.లక్షలోపు 40 లక్షల మంది రైతులు.. 11 లక్షల మందినే ఎలా ఎంపిక చేస్తారు..?

మరిన్ని వార్తలు