Nalgonda : అధికారులకు అదనపు కలెక్టర్ ఆదేశం.. తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి..!
గ్రామాల్లో ప్రజలకు నిరంతరం స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రత్యేక నీటి సరఫరా డ్రైవ్ చేపట్టనున్నట్లు స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి తెలిపారు.

Nalgonda : అధికారులకు అదనపు కలెక్టర్ ఆదేశం.. తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి..!
నలగొండ, మనసాక్షి :
గ్రామాల్లో ప్రజలకు నిరంతరం స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రత్యేక నీటి సరఫరా డ్రైవ్ చేపట్టనున్నట్లు స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో సంబంధిత జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడా త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ప్రత్యేక డ్రైవ్లో భాగంగా గ్రామాల వారీగా బోర్లు, హ్యాండ్పంపులు, ఓవర్హెడ్ ట్యాంకులు, పైప్లైన్లు పూర్తిస్థాయిలో తనిఖీ చేయాలని ఆదేశించారు. పనిచేయని మోటార్లు, లీకేజీలు, బ్రేక్డౌన్లను వెంటనే గుర్తించి తక్షణమే మరమ్మతులు చేయాలని చెప్పారు.
తాగు నీటి ట్యాంకులను శుభ్రపరచి తప్పనిసరిగా క్లోరినేషన్ చేయాలని , అవసరమైన చోట అదనపు బోర్లు, ప్రత్యామ్నాయ నీటి వనరులు సిద్ధం చేసుకోవాలని చెప్పారు.ప్రజల నుంచి వచ్చేతాగునీటి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలన్నారు.
త్రాగునీటి సమస్యలపై నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రత్యేక డ్రైవ్ విజయవంతానికి గ్రామ పంచాయతీ ప్రతినిధులు వినియోగించాలని, మహిళా సంఘాలు, ప్రజలు సహకరించాలని కోరారు. తాగునీటిని వృథా చేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. డిపిఓ శంకర్ నాయక్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ నాగేశ్వరరావు ,ఆర్డబ్ల్యూఎస్ ఈ ఈ శాంత కుమారి ,తదితరులు హాజరయ్యారు.









