Nalgonda : యోగాలో నల్గొండ జిల్లా ఎస్పీ..!
Nalgonda : యోగాలో నల్గొండ జిల్లా ఎస్పీ..!
నల్లగొండ, మన సాక్షి
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కారించుకొని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారి ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలో మిషన్ పరివర్తన్ యాంటీ డ్రగ్ వారోత్సవాలలో భాగంగా యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ హాజరై మాట్లాడుతూ యోగా అనేది పురాతన ఆధ్యాత్మిక అభ్యాసం మని యోగా చేయడం ద్వారా మనసు,శరీరాన్ని ఏక దాటిపై తీసుకొని రావచ్చని అన్నారు.
ముఖ్యంగా పోలీసు ఉద్యోగంలో యోగా ధ్యానం అనేది చాలా అవసరం 24 గంటలు విధినిర్వహణలో అనేక సమస్యలు ఎదురవుతాయని అలాంటపుడు మానసిక ప్రశాంతత కొరకు ప్రతి రోజు ఈ యోగా,ధ్యానం చేయడం ద్వారా ఆందోళన,వత్తిడి తగ్గి శరీరంలో నూతన ఉత్తేజాన్ని నింపుటకు ఎంతగానో దోహదపడుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి,ఏ.ఆర్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు ఆర్.ఐలు, ఎస్.ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
MOST READ :
-
District Collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. పంచాయతీ కార్యదర్శి సస్పెండ్..!
-
District collector : రైతు భరోసా దరఖాస్తులకు రేపటితో ముగియనున్న గడువు.. రూ.516 కోట్లు రైతుల ఖాతాలో జమ..!
-
District collector : పంచాయతీ కార్యదర్శులకు జిల్లా కలెక్టర్ సీరియస్ వార్నింగ్.. ఆ కేసుల జోలికి వెళ్తే క్రమశిక్షణ చర్యలు..!
-
Rythu Bharosa : రైతు భరోసా వారికి కూడా.. ఖాతాలలో జమ.. చెక్ చేసుకోండి..!









