Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుBreaking Newsనల్గొండరాజకీయం

Nalgonda : రైతు భరోసా లేదు, రుణమాఫీ కాలేదు.. హామీలు అమలు చేయాలి..!

రైతులకు వెంటనే రైతు భరోసా డబ్బులు వారి ఖాతాలో జమ చేయాలని రుణమాఫీ కానీ రైతులకు రుణమాఫీ చేయాలని యూరియా అందుబాటులో ఉంచాలని కోరుతూ బిజెపి కిసాన్ మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.

Nalgonda : రైతు భరోసా లేదు, రుణమాఫీ కాలేదు.. హామీలు అమలు చేయాలి..!

నల్లగొండ, మన సాక్షి :

రైతులకు వెంటనే రైతు భరోసా డబ్బులు వారి ఖాతాలో జమ చేయాలని రుణమాఫీ కానీ రైతులకు రుణమాఫీ చేయాలని యూరియా అందుబాటులో ఉంచాలని కోరుతూ బిజెపి కిసాన్ మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు గడ్డం వెంకటరెడ్డి, కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డిలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఎకరానికి 15 వేల రూపాయల చొప్పున రైతు భరోసా ఇస్తామని 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని 11 రకాల పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని శాసనసభ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయినా వాటిని అమలు చేయకపోవడం దురదృష్టకరమన్నారు.

వరంగల్ రైతు డిక్లరేషన్ లో రైతులకు హామీ ఇచ్చిన హామీలన్నింటిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే యూరియాను అందుబాటులో ఉంచాలని ధాన్యం కొనుగోలుకు ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రధానమంత్రి ఫసల్ బీమా ను రాష్ట్రంలో అమలు చేయాలని రైతులకు వ్యవసాయ పరికరాలు సబ్సిడీ పైన అందజేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బిజెపి కిసాన్ మోర్చా నాయకులు భవనం మధుసూదన్ రెడ్డి, గూండా నవీన్ రెడ్డి, యానాల కరుణాకర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మిర్యాల వెంకటేశం, మండల వెంకన్న, దాసోజు యాదగిరి చారి, మాల వెంకటరెడ్డి, వెన్నమల్ల మహేష్, కొప్పు సోమయ్య, పూతపాక లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు