తెలంగాణBreaking Newsక్రీడలుజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : ఆల్ ఇండియా పోలీస్ స్స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2026కు నల్లగొండ పోలీస్ కబడ్డీ క్రీడాకారిణి ఎంపిక..!

నల్లగొండ II టౌన్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ప్రతిభావంతమైన కబడ్డీ క్రీడాకారిణి షైక్ నౌషీన్ ఆల్ ఇండియా పోలీస్ పోలీస్ స్స్పోర్ట్స్ అండ్ గేమ్స్ - 2026 మీట్‌కు ఎంపిక కావడం గర్వకారణమని ఈ ప్రతిష్టాత్మక పోటీలు జమ్మూ అండ్ కాశ్మీర్ లో మార్చి 7వ తేదీ నుండి 13వ తేదీ వరకు నిర్వహించినట్లు ఎస్పి శరత్చంద్ర పవర్ తెలిపారు.

Nalgonda : ఆల్ ఇండియా పోలీస్ స్స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2026కు నల్లగొండ పోలీస్ కబడ్డీ క్రీడాకారిణి ఎంపిక..!

నల్లగొండ, మనసాక్షి:

నల్లగొండ II టౌన్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ప్రతిభావంతమైన కబడ్డీ క్రీడాకారిణి షైక్ నౌషీన్ ఆల్ ఇండియా పోలీస్ పోలీస్ స్స్పోర్ట్స్ అండ్ గేమ్స్ – 2026 మీట్‌కు ఎంపిక కావడం గర్వకారణమని ఈ ప్రతిష్టాత్మక పోటీలు జమ్మూ అండ్ కాశ్మీర్ లో మార్చి 7వ తేదీ నుండి 13వ తేదీ వరకు నిర్వహించినట్లు ఎస్పి శరత్చంద్ర పవర్ తెలిపారు.

ఈ కబడ్డీ క్రీడా పోటీలకు తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ తరపున కెప్టెన్ గా బాధ్యత వహించనున్నారు.4వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ – 2026 పోటీలు ఫిబ్రవరి 16 నుండి 21 వరకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం మరియు సైబరాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించారని ఈ క్రీడా పోటీలలో యాదాద్రి -V జోన్ జట్టు తరఫున కబడ్డీలో బంగారు పతకం సాధించగా, 3వ పోలీస్ స్టేట్‌ మీట్ తరఫున రజత పతకం సాధించారు.

ఈ రెండు సందర్భాల్లోనూ జట్టుకు కెప్టెన్‌గా నాయకత్వం వహించి విశిష్ట ప్రతిభ కనబరిచారు. షైక్ నౌషీన్ ఇప్పటివరకు 20 సార్లు జాతీయ స్థాయి కబడ్డీ పోటీలలో పాల్గొని విశేష ప్రతిభ కనబరిచారు. అదేవిధంగా 3 సార్లు ఇండియన్ క్యాంప్స్‌లో పాల్గొని తన నైపుణ్యాన్ని మరింత మెరుగుపరుచుకున్నారని 2025లో పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ నగరంలో నిర్వహించిన ఆల్ ఇండియా పోలీస్ మీట్‌లో తెలంగాణ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి జట్టును విజయవంతంగా నడిపించారన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ షైక్ నౌషీన్ ను అభినందిస్తూ, జమ్మూ కాశ్మీర్‌లో జరగనున్న ఆల్ ఇండియా పోలీస్ మీట్‌లో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి మరింత గౌరవం తీసుకురావాలని ఆకాంక్షించారు. జిల్లా పోలీస్ శాఖ తరఫున ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

MOST READ : 

మరిన్ని వార్తలు