Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణ

Nalgonda : దొంగతనం కేసులో నిందితుడికి  జైలు శిక్ష..!

Nalgonda : దొంగతనం కేసులో నిందితుడికి  జైలు శిక్ష..!

నల్లగొండ, మన సాక్షి:

మల్లేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నాగర్ కర్నూల్ వెల్డండ గ్రామానికి చెందిన డేరంగుల సంపంగి నాగేష్ మోటర్ సైకిల్ దొంగతనానికి పాల్పడగా ఇతని పై మల్లేపల్లి పోలీస్ స్టేషన్లో అండర్ సెక్షన్379 ఐపిసి ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం సరియైన ఆధారాలు కోర్టుకి సమర్పించగా మంగళవారం అడిషనల్ జె ఎఫ్ సి ఎం జడ్జి, నల్గొండ కెవిఎస్ హరీష్ బాబు నిందితుని 6 నెలల జైలు శిక్ష విధించబడిందని జిల్లా ఎస్పి ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ కేసులో సరిఅయిన ఆధారాలు సేకరించి కోర్టుకి అందజేసి నిందితుని శిక్ష పడే విధంగా చేసిన అప్పటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఎస్సై. వీరబాబు,పబ్లిక్ ప్రాసక్యూటర్ రూపాంజలి, కొండమల్లేపల్లి సీఐ ధనుంజయ ప్రస్తుత ఎస్సై రాముర్తి, సి డి ఓ వై నగేష్ : డి శ్రావణ్ కుమార్ గార్లను జిల్లా ఎస్పి అభినందించారు.

ALSO READ: మిర్యాలగూడ : పోలీస్ తనిఖీలలో రూ. 5. 73 కోట్ల విలువైన బంగారం స్వాధీనం..!

మరిన్ని వార్తలు