Narayanpet : క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలి.. ఎంపీ డి కే అరుణ..!
గ్రామీణ క్రీడాకారుల నైపుణ్యం వెలికి తీసి వారి సత్తాను ప్రపంచానికి చాటే ఉద్దేశ్యంతోనే ప్రధాని సంసద్ ఖేల్ ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నదని పాలమూరు ఎంపీ డి కే అరుణ అన్నారు.

Narayanpet : క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలి.. ఎంపీ డి కే అరుణ..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
గ్రామీణ క్రీడాకారుల నైపుణ్యం వెలికి తీసి వారి సత్తాను ప్రపంచానికి చాటే ఉద్దేశ్యంతోనే ప్రధాని సంసద్ ఖేల్ ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నదని పాలమూరు ఎంపీ డి కే అరుణ అన్నారు. గురువారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో ప్రధాని సంసద్ ఖేల్ ఉత్సవాలను బిజెపి రాష్ట్ర క్రమ శిక్షణ సంఘం సభ్యులు నాగురావు నామాజీ,రాష్ట్ర నాయకులు కే.రతంగ్ పాండురెడ్డి,బి.కొండయ్య,జిల్లా బిజెపి అధ్యక్షుడు సత్య యాదవ్, జిల్లా ఖేల్ ఉత్సవాల కన్వీనర్ జనార్ధన్, జిల్లా కన్వీనర్ డోకూరు తిరుపతి రెడ్డి లతో కలిసి ఘనంగా ప్రారంబించారు.
అనంతరం జరిగిన సభలో ఎంపీ డి కే అరుణ మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్రమోడీ ప్రధాని అయ్యాక దేశ క్రీడలకు ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తున్నారని అన్నారు.ప్రధాని ప్రోత్సాహంతో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని అన్నారు. దాంతో గ్రామీణ స్థాయిలో ఆణిముత్యాలు ఎందరో ఉన్నారని వారిని వెలికి తీసి ప్రపంచానికి పరిచయం చేయడం కోసమే దేశవ్యాప్తంగా క్రీడలు నిర్వహిస్తున్నారని అన్నారు.
ప్రతి గ్రామం నుంచి క్రీడాకారులు పాల్గొని తమ నైపుణ్యం చాటాలని కోరారు.వచ్చే ఏడాది మరింత ఘనంగా పార్లమెంటు పరిధిలో క్రీడా పోటీలు నిర్వహిస్తామని అన్నారు.ఈ క్రీడా పోటీల్లో క్రీడాకారులు తమ నైపుణ్యం క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కొండా శ్వేత సత్యయాదవ్, వైస్ చైర్ పర్సన్ మంజుల జి ఆర్ రెడ్డి కౌన్సిలర్లు,పట్టణ బిజెపి అధ్యక్షుడు పోషల్ వినోద్, జిల్లా, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.









