TOP STORIESBreaking Newsజాతరలుజిల్లా వార్తలునల్గొండ

మరో శ్రీ శైలక్షేత్రంగా నెల్వలపల్లి..!

కోరిన కోరికలు తీర్చే దైవం గా భావిస్తూ కొంగుబంగారమై గత 250 సంవత్సరాల క్రితం నెలవలపల్లి గ్రామంలో పూర్వికులు నెలకొల్పబడిన శ్రీ మల్లికార్జున బ్రమరాంబల స్వామి దేవాలయ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు వివిధ కార్యక్రమాలతో మూడు రోజుల నుండి ప్రారంభమయ్యాయి.

మరో శ్రీ శైలక్షేత్రంగా నెల్వలపల్లి..!

ప్రారంభమైన శ్రీ మల్లికార్జున భ్రమరాంబ స్వామి బ్రహ్మోత్సవాలు..!

చింతపల్లి, మనసాక్షి. :

కోరిన కోరికలు తీర్చే దైవం గా భావిస్తూ కొంగుబంగారమై గత 250 సంవత్సరాల క్రితం నెలవలపల్లి గ్రామంలో పూర్వికులు నెలకొల్పబడిన శ్రీ మల్లికార్జున బ్రమరాంబల స్వామి దేవాలయ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు వివిధ కార్యక్రమాలతో మూడు రోజుల నుండి ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా మరో శ్రీశైల క్షేత్రంగా నెలవలపల్లిలో గ్రామంలోనెలకొని ఉన్న దేవాలయానికి ఆనాటి నుండి ఈనాటి వరకు నల్లగొండ జిల్లాలో ఎంతో ప్రాచుర్యం పొందుతుంది. ఈ దేవాలయం ఆనాడు నుండి నేటి వరకు గ్రామంలోని యాదవుల ఆధీనంలో కొనసాగుతూ దాతల సహాయ సహకారాలతో దినదిన అభివృద్ధి చెందుతూ ఎంతో అభివృద్ధి చెందుతుంది.

ప్రతి ఏటా శ్రీశైల మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈ గ్రామంలో కూడా అదే విధంగా స్వామివారి బ్రహ్మోత్సవాలను కన్నుల పండుగగా గ్రామ ప్రజలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ గ్రామంలో ప్రతి ఇంట మల్లికార్జున స్వామి పేరుపై ఆడపిల్లలకు గాని,మగపిల్లలకు గాని నామకరణ చేయడం ఆ దైవ భక్తికి నిదర్శనం.

ఈ బ్రహ్మోత్సవాలు వారం రోజులు గ్రామంలో వివిధ కార్యక్రమాలతో ఆలయ కమిటీ నిర్వాహకులు చేపడుతున్నారు. గ్రామం నడిబొడ్డులో నెలకొని ఉన్న ఈ దేవాలయ బ్రహ్మోత్సవ కార్యక్రమాలకు ప్రతి సంవత్సరం వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు.

ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు స్వామిని కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేర్చుతాడనే నమ్మకం భక్తుల్లో ఎంతో నమ్మకం ఉంది. దేవాలయ నిర్మాణ అనంతరం ఉన్నటువంటి ఆనాటి పూజారి గొడ్డటి కొమరయ్య కొలుపు చెప్పేది. వారు చెప్పిన మాట సత్యంగా ఉండేది. అప్పటి నుండి భక్తులు చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసి గుడిలో రాత్రి నిద్ర చేసి స్వామి వారి ఆజ్ఞ తీసుకున్న తదుపరి తిరిగి వెళ్లేవారు.

ఆ ఆనవాతి ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో కొనసాగుతుంది. ప్రస్తుతం వారి మనవడు గొడ్డటి జంగయ్య ప్రస్తుతం పూజారిగా వ్యవహరిస్తున్నారు. మహాశివరాత్రి తదుపరి రోజు నుండి ప్రారంభమైన ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా ఆదివారం స్వామివారి రథోత్సవాన్ని గ్రామంలో అత్యంత వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ నిర్వాహకులు సర్వం సన్నద్ధం చేస్తున్నారు.

ఈ రథోత్సవ కార్యక్రమానికి దేవరకొండ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్, దేవరకొండ డి.ఎస్.పి, నాంపల్లి సిఐ, చింతపల్లి ఎస్ఐ, చింతపల్లి మండల వివిధ శాఖల అధికారులు, మండలంలోని పలు గ్రామాల సర్పంచులు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు ఆలయ పూజారి జంగయ్య పేర్కొన్నారు.

By : Puppala Venkateshwarlu, Sr. Reporter

ఇవీ చదవండి : 

మరిన్ని వార్తలు