Dharani : తెలంగాణలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, ముటేషన్ల కోసం.. సరికొత్త సేవలు..!

Dharani : తెలంగాణలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, ముటేషన్ల కోసం.. సరికొత్త సేవలు..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, ముటేషన్ల సేవల కోసం తెలంగాణ ప్రభుత్వం సరి కొత్త ఆన్లైన్ సేవలను తీసుకురానున్నది. ఇప్పటివరకు కొనసాగిన ధరణి పోర్టల్ ఇక బంద్ కానున్నది. ఆస్థానంలో భూమాత రానున్నది. ఆ పోర్టల్ భూమాతగా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ధరణి పోర్టల్ పై అనేక ఆరోపణలు చేసింది. ధరణి అడ్డుపెట్టుకొని అప్పటి అధికార పార్టీ నాయకులు అడ్డగోలుగా భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్నారనే విషయాన్ని వెలుగులోకి వచ్చాయి.
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలలో ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి పట్టాలు కూడా రద్దు చేసింది. కాగా ధరణి పోర్టల్ రద్దుచేసి భూమాతను తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలోనే హామీ ఇచ్చారు. ఆ మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో ఆర్ ఓ ఆర్ – 2024, ధరణి అంశాలపై అధికారులతో సమీక్షలో మాట్లాడారు.
ధరణి స్థానంలో భూమాతను తీసుకురావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆమోదముద్ర వేసినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ నుంచి 2017 వరకు కూడా వ్యవసాయ భూములకు సంబంధించిన రికార్డులు మా భూమి వెబ్సైట్ పోర్టల్ లో జరిగేవి.
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రక్షాళన చేసి 2020 అక్టోబర్ 29న ధరణి పోర్టల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దాంతో 33 రకాల సాఫ్ట్వేర్ మాడ్యూల్స్ ను ఏర్పాటు చేశారు. దానిలో అక్రమాలు అవినీతి చోటు చేసుకుంటున్నాయని నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా భూమాత పోర్టల్ ను తీసుకురానున్నది.
గత శాసనసభ సమయంలోనే ఆర్ ఓ ఆర్ – 2024 ముసాయిదా చట్టం పై ప్రకటన చేశారు. కానీ అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. త్వరలో అధికారికంగా భూమాత పేరును ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.









