Nalgonda : జాతీయ త్రోబాల్ కు ఎంపికైన NG కళాశాల విద్యార్థి..!
Nalgonda : జాతీయ త్రోబాల్ కు ఎంపికైన NG కళాశాల విద్యార్థి..!
నల్లగొండ, మన సాక్షి :
తెలంగాణ త్రోబాల్ అసోసియేషన్ వారు నిర్వహించినటువంటి రాష్ట్ర త్రోబాల్ సెలెక్షన్ లో నాగార్జున ప్రభుత్వ కళాశాలకు చెందిన జి. ప్రవీణ్ కుమార్ బి.ఏ ప్రథమ సంవత్సరం విద్యార్థి ఎంపిక కావడం జరిగింది. ఈ విద్యార్థి త్వరలో జార్ఖండ్లోని రాంచీ పట్టణంలో జరిగే నేషనల్ త్రో బాల్ సెలక్షన్లో పాల్గొనడం జరుగుతుంది.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ కళాశాలలో క్రీడలకు సముచిత స్థానం కల్పించి విద్యార్థుల అభ్యున్నతికి పాటుపడతామని తెలియజేయడం జరిగింది కళాశాల ఇన్చార్జి ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ ఆదెమల్లేశం విద్యార్థిని అభినందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ పరంగి రవికుమార్ అకాడమిక్ కోఆర్డినేటర్లు డాక్టర్ డి మునిస్వామి డాక్టర్ అంతటి శ్రీనివాస్,ఇతర అధ్యాపకులైన డాక్టర్ వెల్దండి శ్రీధర్ ఐ క్యూ ఎ సి కోఆర్డినేటర్ డా.ప్రసన్నకుమార్ సిహెచ్ సుధాకర్ డాక్టర్ బొజ్జ అనిల్ కుమార్ లు విద్యార్థిని ప్రశంసించారు.
MOST READ :
-
Nalgonda : ఉదృతంగా మూసీ నది.. భీమారం కాజ్వే వద్ద పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ..!
-
Rythu Bima : 18 ఏళ్లు నిండిన వారికి ఐదు లక్షల బీమా.. రెండు రోజులే గడువు.. కావలసిన పత్రాలు ఇవీ..!
-
Gas Cylinder : మహిళలకు అదిరిపోయే రాఖి గిఫ్ట్.. వంట గ్యాస్ పై రూ.300 సబ్సిడీ..!
-
Agricultural Tools : రైతులకు శుభవార్త.. సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు.. దరఖాస్తులు స్వీకరణ..!









