TG News : డిజిటల్ క్రాప్ బుకింగ్ సర్వేకు అడ్డంకులు.. ఎఈఓ ల నిరసన..!
TG News : డిజిటల్ క్రాప్ బుకింగ్ సర్వేకు అడ్డంకులు.. ఎఈఓ ల నిరసన..!
సూర్యాపేట, మనసాక్షి :
తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన వ్యవసాయ పంటల డిజిటల్ క్రాఫ్ బుకింగ్ సర్వేకు అడ్డంకులు ఏర్పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా పంటల సాగును సర్వే చేసి ఫోటోలతో సహా డిజిటల్ లో అప్లోడ్ చేయాల్సి ఉంది. ఈ సర్వేను వ్యవసాయ విస్తరణ అధికారులకు అప్పగించారు. రాష్ట్రవ్యాప్తంగా క్లస్టర్ల వారిగా వ్యవసాయ విస్తరణ అధికారులు ఉన్నారు.
కాగా ఆ క్లస్టర్ పరిధిలో ఉన్న వ్యవసాయ భూమిని అంతటిని సర్వే చేసి వివరాలను, ఫోటోలను డిజిటల్ లో అప్లోడ్ చేయాల్సి ఉంది. కాగా ఒక్కొక్క క్లస్టర్ పరిధిలో వేల ఎకరాల భూమి ఉంటుంది. దానంతటిని ప్రతిరోజు సర్వే చేసి డిజిటల్ లో అప్లోడ్ చేయటం ఏఈఓ లకు అప్పగించడం పై వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో 2600 మంది ఏవోలు ఉన్నారు. వారిలో ఎక్కువగా మహిళలే ఉండటంతో పంట పొలాల వద్దకు వెళ్లి సర్వే చేయడం సాధ్యమయ్యే పని కాదంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దాంతో డిజిటల్ సర్వేకు అడ్డంకులు ఏర్పడ్డాయి.
సూర్యాపేట జిల్లాలో క్లస్టర్ ల వారిగా విధులు నిర్వహిస్తున్న వ్యవసాయ విస్తరణ అధికారులు డిజిటల్ క్రాప్ బుకింగ్ సర్వే ను నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీ చేయడం పట్ల ఎఇవొలు నిరసన వ్యక్తం చేస్తూ సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి ని కలిసి వినతిపత్రం అందజేశారు.
డిజిటల్ క్రాప్ బుకింగ్ సర్వే ఎఇవొలకు కష్టంగా మారిందని, గ్రామాలలో పొలాల దగ్గరకు వెళ్లి ఎఇవొలు ప్రతి అర ఎకరం భూమిని సర్వే చేసి ఫోటోలు పంపవలసిన అవసరం వుందని తెలంగాణ ఎఇవొల సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు రుషిగంపల జానయ్య అన్నారు.
వ్యవసాయ విస్తరణ అధికారులకు ఒక క్లస్టర్ లో ఐదు వేల ఎకరాలకు బదులుగా ఏడువేలు, పదివేలు, ఇరవై వేల ఎకరాలభూమి కూడ వున్నాయని, డిజిటల్ సర్వే చేయడం ఎఇవొలకు కష్టసాధ్యమైన పనిగా మారిందని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా జానయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో కనీస సౌకర్యాలు లేవని, మహిళా అధికారులు వ్యవసాయ భూముల దగ్గరకు ఒంటరిగా వెళ్లి ఎలా సర్వే చేయగలరని ప్రశ్నించారు. పొలాల వద్ద పాములు తిరడంతో పాటు, నడవడానికి దారి కూడ వుండదని ఆయన అన్నారు.
రైతు వేదికలు ఊరిబయట వున్నాయని, అక్కడ కనీసం మంచినీటి సౌకర్యం కూడ లేదని చెప్పారు. వ్యవసాయ విస్తరణ అధికారులు పదిహేను, ఇరవై సంవత్సరాల సర్వీసు వున్న వారికి కూడ పదోన్నతలు లేవని ఉద్యోగ విరమణ వరకు కూడ అదే పోస్ట్ లో పనిచేయవలసిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
ఇతర రాష్ట్రాలలో అవుట్ సోర్సింగ్ సిబ్బంది ద్వారా డిజిటల్ క్రాప్ బుకింగ్ సర్వే చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రములో మాత్రం ఎఇవొలకు అప్పగించి ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదని, కనీసం అటెండర్ లు కూడ లేరని అన్నారు. ఇప్పటికే రైతు రుణమాఫి పధకం అమలు కాని వారి ఇంటింటికి వెళ్లి ఎఇవొలు వివరాలు సేకరించి ప్రభుత్వానికి అందించారని, ఇప్పుడు డిజిటల్ సర్వే పేరుతో తమకు కష్టసాధ్యమైన పనిని అప్పగించి తప్పనిసరిగా చేయాలని ఆదేశాలు జారీ చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వున్న 2600 మంది ఎఇవొ లు డిజిటల్ సర్వే కు వ్యతిరేకంగా తమ నిరసన తెలియజేస్తున్నారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ ల సంఘం ప్రధాన కార్యదర్శి ఉప్పయ్య, శ్రీకాంత్, నరేష్, జానయ్య, సత్యం,గోపి, సతీష్, రియాజ్, అనూష, జాన్సి, జాన్సి, శోభ, లక్ష్మి, స్వాతి, రమ్యతేజ, శ్రీజన, అన్నపూర్ణ, శ్రీను, సాయి రాజ్ ఉన్నారు.
LATEST UPDATE :
-
Uttam Kumar Reddy : పింఛన్లు, రేషన్ కార్డుదారులకు భారీ గుడ్ న్యూస్.. వచ్చే నెల నుంచి..!
-
Miryalaguda : ప్రభుత్వ ఆసుపత్రిలో కిటకిటలాడిన రోగులు.. ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ..!
-
తనకు, తన కూతురికి న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు భార్య ధర్నా..!
-
Nalgonda : మూసి ప్రవాహంలో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులు.. కాపాడిన పోలీసులు..!










