Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణ

రాష్ట్ర సరిహద్దుల్లో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.. జిల్లా ఎస్పీ ఆదేశం

రాష్ట్ర సరిహద్దుల్లో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.. జిల్లా ఎస్పీ ఆదేశం

మఠంపల్లి , మన సాక్షి:

సరిహద్దు వెంట ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పిఆదేశించారు. పోలీస్ స్టేషన్ల నందు పరిసరాలు పరిశీలించారు, పోలీస్ స్టేషన్ పరిధిలో నేర ప్రవృత్తి తెలుపు మ్యాపులు, మండల భౌగోళిక స్థితిగతులు, సరిహద్దు పరిస్థితులు, హిస్టరీ షీట్స్ గురించి పోలీస్ స్టేషన్ అధికారులను అడిగారు. స్టేషన్ నందు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, సిబ్బందిని సమర్థవంతంగా ఉపయోగించాలని అన్నారు.

డయల్ 100 పిర్యాదులపై వేగంగా స్పందించాలని ఆదేశించారు. హుజూర్నగర్ సర్కిల్ కు ఆంధ్రా సరిహద్దు ప్రాంతం, కృష్ణా బేసిన్ ఎక్కువగా ఉన్నది ఎల్లప్పుడూ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మఠంపల్లి చెక్ పోస్ట్ వద్ద వాహనాలు క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని అక్రమ రవాణా అడ్డుకోవాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పని చేయాలి, నేరాల నివారణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణలో సమాచారం ఒకరికొకరు చేరవేసుకుని టీమ్ వర్క్ చేయాలని కోరారు.

డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు, కార్డన్ అండ్ సెర్చ్ లు నిర్వహించాలి ఆదేశించారు. పోలీసు స్టేషన్ కు వచ్చే ప్రతి పిర్యాదుదారులకు కనీస సౌకర్యాలు కల్పించి, వారితో మర్యాదగా ప్రవర్తించి సహాయ సహకారాలు అందించాలని సూచించారు.

పాత నేరస్తులపై, గంజాయి సంభందిత కేసుల్లో ఉన్న నరస్తులపై, నిందితులపై నిఘా ఉంచాలి అన్నారు. గంజాయి మూలాలు లేకుండా నివారించడం కోసం కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ శ్రీధర్ రెడ్డి, సిఐ చరమందరాజు, ఎస్సై ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి : 

NALGONDA : డిజిటల్ బోధన తీరుపై జిల్లా కలెక్టర్ పరిశీలన.. విద్యార్థులతో ముఖాముఖి..!

BUDGET 2024 : తెలంగాణ బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత..!

SRISHAILAM : శ్రీశైలంకు భారీ వరద.. విద్యుత్ ఉత్పత్తితో దిగువకు నీటి విడుదల..!

మరిన్ని వార్తలు