తెలంగాణBreaking Newsజిల్లా వార్తలువ్యవసాయంసూర్యాపేట జిల్లా

Suryapet : మిరపలో తెగుళ్ల నిర్వహణకై యాజమాన్య పద్ధతులు పాటించాలి..!

Suryapet : మిరపలో తెగుళ్ల నిర్వహణకై యాజమాన్య పద్ధతులు పాటించాలి..!

సూర్యాపేట, మనసాక్షి :

మిరుప తోట లో తామర పురుగుల నిర్వహణ కై సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి తీగల నాగయ్య, కృషి విజ్ఞాన కేంద్రం, కంపసాగర్ శాస్త్రవేత్త రాములమ్మ లు అన్నారు.

మిరప పంటలో ఆశిస్తున్న పురుగులు మరియు తెగుళ్లను పరిశీలించడానికి జిల్లా ఉద్యాన అధికారి నాగయ్య , కృషి విజ్ఞాన కేంద్రం, కంపసాగర్ శాస్త్రవేత్త రాములమ్మ , డివిజన్ స్థాయి ఉద్యాన అధికారి ప్రదీప్తి చింతలపాలెం మండలంలోని దొండపాడు, గుడిమల్కాపురం, మరియు చింతలపాలెం గ్రామంలో మిరప పంట క్షేత్రాలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మిరప పంటను సాగు చేసే రైతులు ప్రస్తుతం కాపు దశలో ఉన్న తోటల్లో తామర పురుగులు, పూత పురుగులు ఉధృతిని గమనించడమైనది.

ఈ సందర్భంగా రాములమ్మ శాస్త్రవేత్త రైతు సోదరులు తామర పురుగుల నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించవలసిందిగా కోరారు. ఎకరాకు 25 నుంచి 35 నీలిరంగు జిగురు అట్టాలు అమర్చవలసిందిగా సూచించారు.

ఉధృతి తక్కువగా ఉన్న తోటల్లో వేప నూనె (10,000 పీపీఎం ) 3ఎం ఎల్ / లీటర్ నీటికి కలిపి పిచికారి చేయవలసిందిగా సూచించారు. ఉధృతి ఎక్కువగా ఉన్న తోటలో ఎసిటామిఫ్రైడ్ 20% @ 0.2 గ్రాములు/లీటర్ నీటికి (లేదా) సయాంత్రనిలిప్రోలు 10.26 ఓ.డి 2 గ్రాములు/ లీటర్ నీటికి (లేదా) స్పైనోసాడ్@ 0.3 ఎం ఎల్ / లీటర్ నీటికి పిచికారి చేయడం ద్వారా నివారించుకోవచ్చని సూచించారు.

ఈ క్షేత్ర సందర్శనలో రైతులు లక్ష్మారెడ్డి, రంగారెడ్డి, వెంకయ్య, పాపయ్య, బాలు, బాల్ రెడ్డి, లక్ష్మణ్, కొండారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Seeds : నకిలీ విత్తనాలతో నిండా మునిగిన రైతులు.. వరి పొలాలు సందర్శించిన కోదండరెడ్డి..! 

  2. Gold Price : బంగారం ధర ఎలా నిర్ణయిస్తారు.. స్వచ్ఛత ఎలా.. అందరూ తెలుసుకోవాల్సిందే..!

  3. News : పార్టీ మారిన ఎమ్మెల్యేలు ట్విస్ట్.. ఒకే మాట.. ఒకే నిర్ణయం..!

  4. District collector : పెద్దగట్టు జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

మరిన్ని వార్తలు