Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవ్యవసాయం

Paddy procurement : ధాన్యాన్ని కొనుగోలు చేయాలి.. అద్దంకి – నార్కట్ పల్లి రహదారిపై రైతుల రాస్తారోకో..!

Paddy procurement : ధాన్యాన్ని కొనుగోలు చేయాలి.. అద్దంకి – నార్కట్ పల్లి రహదారిపై రైతుల రాస్తారోకో..!

మాడుగులపల్లి, మన సాక్షి :

మాడుగులపల్లి పిఎసిఎస్ కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లు జరగడంలేదని అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని ఆవేదన చెంది అద్దంకి నార్కట్పల్లి రహదారిపై రైతులు బైఠాయించి మాడుగులపల్లి మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రానికి రైతులు ధాన్యాన్ని తరలించి దాదాపుగా నెల రోజులు కావస్తున్న అక్కడ సిబ్బంది ధాన్యం కొనుగోలను చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

వర్షాలకు ధాన్యం పూర్తిగా తడిసి మొలకెతుకుతున్నాయని, కొనుగోలు సిబ్బందిని కాంటాలు వేయమని అడిగితే ఎవరు కూడా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యం కుప్పలను ఆరబెట్టినప్పటికీ కూడా కొనుగోలు కొనసాగించకపోవడంతో రైతుల అగ్రహం కట్టలు తెంపుకుంది..దీంతో ఒక్కసారిగా రైతులందరూ రోడ్డుపైకి బైటాయించి నిరసన వ్యక్తం చేశారు.

దీంతో రహదారిపై ఇరువైపులా వాహనాలు ఎక్కడి ఎక్కడ ఆగిపోయి కిలోమీటర్ల భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.

స్థానిక తహసిల్దార్ తక్షణమే మా వద్దకు వచ్చి మా సమస్యకు పరిష్కారాన్ని చూపాలని లేకుంటే ఈ ధర్నాను విరమించేది లేదని రైతులు చెబుతు నినాదాలు చేశారు. చివరకు పోలీసులు రైతులకు సమాధానం చెప్పి ధర్నాను విరువింపజేసి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.

MOST READ :

  1. Hand Ball : రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైన జడ్పీ హైస్కూల్ విద్యార్థులు..!

  2. District Collector : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై అధికారులకు జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. టార్గెట్స్ పూర్తి చేయాలి..!

  3. State Level Badminton : రాష్ట్రస్థాయి బాడ్మింటన్‌ పోటీలకు శరణ్య ఎంపిక..!

  4. Miryalaguda : సాగర్ ఎడమ కాలువ కట్ట.. రైతులకు వెన్నులో వణుకు..!

  5. Bus Accident : ఘోర ప్రమాదం.. దగ్దమైన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.. 20 మందికి పైగా మృతి..!

మరిన్ని వార్తలు