Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా

PMSBY : ఏడాదికి రూ.20 చెల్లిస్తే చాలు.. రూ.2 లక్షల ప్రమాద బీమా వర్తింపు.. మీరు అర్హులేనా..!

PMSBY : ఏడాదికి రూ.20 చెల్లిస్తే చాలు.. రూ.2 లక్షల ప్రమాద బీమా వర్తింపు.. మీరు అర్హులేనా..!

కంగ్టి, మన సాక్షి :

ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తడ్కల్ బ్యాంకు మేనేజర్ కే మహేందర్ సూచించారు. శుక్రవారం కంగ్టి మండల పరిధిలోని దామరగిద్ద గ్రామంలో ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిఎంఎస్బివైతో పథకం కోసం కేవలం సంవత్సరానికి రూ.20 చెల్లిస్తే రూ.2 లక్షల వరకు ప్రమాద బీమా లభిస్తుందని, 18 నుంచి 70 ఏళ్ల వయస్సు గల వారికి ఈ అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

రూ.436 చెల్లిస్తే రూ.2 లక్షలు

ప్రధానమంత్రి జీవన్‌ జ్యోతి భీమ యోజన పీఎంజెజెబివై పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బ్యాంక్ మేనేజర్ సూచించారు.ఈ పథకం కోసం కేవలం సంవత్సరానికి రూ.436 చెల్లిస్తే ప్రమాదం జరిగిన, సహజ మరణమైన రూ.2 లక్షల వరకు బీమా లభిస్తుందని, 18 నుంచి 50 ఏళ్ల వయస్సు గల వారికి ఈ అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

ఈ పథకంలో కేవలం సంవత్సరానికి రూ.1000 చెల్లిస్తే ప్రమాద భీమా 20 లక్షలు వస్తుందని అన్నారు. బ్యాంక్ లో ఖాతా ఉన్న ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినిగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో వివోఏ శ్రీపతి, బ్యాంకు మిత్ర విఠల్, గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.

MOST READ : 

  1. ACB : ఐదు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్..!

  2. Gold Price : వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Srisailam : నిండుకుండలా శ్రీశైలం.. నాగార్జునసాగర్ కు భారీ వరద..!

  4. డిజిటల్ ఫస్ట్ జీవిత బీమా జాయింట్ వెంచర్‌ను ప్రకటించిన ఏంజెల్ వన్, లివ్‌వెల్..!

మరిన్ని వార్తలు