Pds Rice : యదేచ్చగా రాష్ట్ర రాజధానికే లారీలలో పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా..!
Pds Rice : యదేచ్చగా రాష్ట్ర రాజధానికే లారీలలో పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా..!
గజ్వేల్, మనసాక్షి :
తెలంగాణలో పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. లారీలలోనే యదేచ్చగా రాష్ట్ర రాజధానికే తరలిస్తున్నారు. ఇంకా కొన్నిచోట్ల లారీలలో ఇతర రాష్ట్రాలకు సైతం తరలిస్తున్నారు. పోలీసులు నిఘా పెట్టి పిడిఎస్ బియ్యం పట్టుకుంటున్నప్పటికీ అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరు కాయ లు సాగుతూనే.. ఉంది. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలో బుద్ధ రాములు, గుర్రం రాములు ఇరువురు కలసి లారీలో ఎలాంటి ప్రభుత్వం అనుమతి లేకుండా అక్రమంగా ప్రభుత్వ రేషన్ బియ్యం జగదేవపూర్ నుండి హైదరాబాదుకు రవాణా చేస్తున్నారు.
నమ్మదగిన సమాచారంపై జగదేవపూర్ ఎస్ఐ చంద్రమోహన్ సిబ్బందితో కలిసి వెళ్లి పట్టుకున్నారు. జగదేవపూర్ ఎస్ఐ చంద్రమోహన్,కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ చంద్రమోహన్ మాట్లాడుతూ
పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక పిడిఎస్ రైస్ అక్రమ రవాణా చేసిన నిల్వ ఉంచిన,చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జూదం, గ్యాంబ్లింగ్ చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గ్రామాలలో, పట్టణాలలో ఇసుక అక్రమ రవాణా చేసినా, పిడిఎస్ రైస్ అక్రమంగా దాచిపెట్టిన రవాణా గ్యాంబ్లింగ్, పేకాట, గుట్కాలు కలిగి ఉన్న రవాణా చేసిన మరియు మరిఏదైనా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా జగదేవపూర్ పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
ఇవి కూడా చదవండి :
Runamafi : రుణమాఫీ పై ప్రభుత్వం ట్విస్ట్.. అందరికీ కాదు, ఇవీ మార్గదర్శకాలు..!
Good News : సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. వారికి రూ.5 లక్షలు సహాయం..!
ఆల్మట్టి నుంచి దిగువకు నీరు.. సాగర్ ఆయకట్టులో ఎదురుచూపులు..!









