Pedda Gattu : అర్థరాత్రి కేసారం నుంచి పెద్దగట్టుకు చేరిన దేవరపెట్టే..!
Pedda Gattu : అర్థరాత్రి కేసారం నుంచి పెద్దగట్టుకు చేరిన దేవరపెట్టే..!
దేవరపెట్టేలోని దేవతమూర్తులకు ప్రత్యేక పూజలు
– ఓ లింగా నామస్మరణతో మారుమోగిన వీధులు
సూర్యాపేట, మనసాక్షి :
రెండేళ్ళ కోసం జరుపుకునే తెలంగాణ రాష్ట్రంలోని రెండో అతిపెద్ద జాతర దురాజ్పల్లి పెద్దగట్టు(గొల్లగట్టు) జాతరకు ఆదివారం అర్ధరాత్రి దిష్టిపూజ కార్యక్రమాన్ని నిర్వహించనుండగా సూర్యాపేట మండల పరిదిలోని కేసారం గ్రామం నుంచి దేవరపెట్టే గుట్టపైకి తరలివెల్లింది. కేసారం గ్రామంలో మెంతబోయిన వారు, మున్న వారు, గొర్ల వారు, బైకాని వారు దేవరపెట్టేలోని దేవతామూర్తులైన లింగమంతులస్వామి, గంగమ్మ, ఆకుమంచమ్మ, యలమంచమ్మ, చౌడమ్మల బొమ్మలను గుడ్డతో తుడిచి పసుపు, కుకుమలతో బొట్టు పెట్టారు.
బంతిపూల దండలతో అలంకరించి కుల పెద్దలు దూప దీపారాదన చేసి కొబ్బరికాయలు కొట్టి పరమాన్నం నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకొని దేవరపెట్టేను ఓ లింగా ఓలింగా అంటూ కదిలించారు. గ్రామంలో మెంతబోయిన వారి ఇంటి నుంచి అందెనపు చౌడమ్మ దేవరపెట్టే ఊరేగింపుగా గొల్లలు కాలినడకన భూజాలపై మోసుకుంటూ తాళాలు వేస్తూ కాళ్ళకు రవ్వ గజ్జెలకు కట్టుకొని లింగా ఓ లింగా నామస్మరణతో ఊరేగింపుగా తీసుకెళ్ళారు.
దేవరపెట్టేను తీసుకెళ్ళే మార్గంలో ఉన్న గ్రామ దేవతలకు మొక్కులు సమర్పిస్తూ ఓ లింగా ఓ’లింగా అంటూ వేగంగా లింగమంతులస్వామి ఆలయం వైపు సాగిపోయారు. ఈ కార్యక్రమంలో చివ్వేంల తహసిల్దార్ కృష్ణయ్య, పెద్దగట్టు ఆలయ కమిటీ డైరెక్టర్లు గొర్ల గన్నారెడ్డి, మెంతబోయిన లింగస్వామి, మెంతబోయిన చిన్న మల్లయ్య, మాజీ జెడ్పిటిసి జిడి బిక్షం, జటంగి నాగరాజు, ధరావత్ జయేందర్, మెంత నాగయ్య, వెంకన్న, మెంతబోయిన లచ్చయ్య, మెంతబోయిన పళ్ళ లింగయ్యలు పాల్గొన్నారు.
MOST READ :
-
Good News : రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. రూ.5లక్షలు పొందే పథకం.. ఇలా దరఖాస్తు చేసుకోండి..!
-
TG News : కుల గణన సర్వే రిపోర్ట్.. బీసీ జనాభా లెక్క తేలింది.. అధికారికంగా ప్రకటించిన కమిటీ..!
-
Rythu Bharosa : రైతుల ఖాతాలలో భరోసా డబ్బులు.. ఎప్పటినుంటే.. లేటెస్ట్ అప్డేట్
-
TG News : తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య భేటీ నిజమేనా.. సీఎంకు ఆ ఎమ్మెల్యే లేఖ..!
-
TG News : తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య భేటీ నిజమేనా.. సీఎంకు ఆ ఎమ్మెల్యే లేఖ..!










