తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుపెద్దపల్లి జిల్లా

District collector : పెండింగ్ ధరణి దరఖాస్తులను పరిష్కరించాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

District collector : పెండింగ్ ధరణి దరఖాస్తులను పరిష్కరించాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

పెద్దపల్లి (ధర్మారం), మన సాక్షి :

నిర్దేశిత గడువులోగా పెండింగ్ ధరణి దరఖాస్తులను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. ధరణి దరఖాస్తుల పై జిల్లాలోని తహసిల్దార్ లతో రివ్యూ నిర్వహించారు. జిల్లాలో పెండింగ్ ఉన్న ధరణి దరఖాస్తుల పరిష్కారం అంశంపై మండలాల వారీగా కలెక్టర్ సమీక్షించారు.

ప్రతి మండలంలో పెండింగ్ ఉన్న సమస్యలు వాటికి గల కారణాలు, పరిష్కరించేందుకు సిద్ధం చేసుకున్న ప్రణాళిక వివరాలను కలెక్టర్ తెలుసుకొని అధికారులకు పలు సూచనలు చేశారు. సమయంలో ఎక్కడ పొరపాటు కాకుండా జాగ్రత్త వహించాలని, మండలంలో పెండింగ్ ఉన్న ధరణి దరఖాస్తులకు అనుగుణంగా బృందాలను ఏర్పాటు చేసుకొని ప్రణాళిక ప్రకారం దరఖాస్తులు పరిష్కరించాలని తహసిల్దార్లను ఆదేశించారు. ఈ సమావేశంలో తహసిల్దార్లు డిప్యూటీ తాసిల్దారులుసంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : 

రేపు తెలంగాణ వ్యాప్తంగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మల దగ్ధం.. బీఆర్ఎస్ పిలుపు..!

NALGONDA : అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాల వల్ల స్వయం ఉపాధి.. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి..!

Nalgonda : పచ్చని చెట్లు బొగ్గు పాలు.. యదేచ్ఛగా బొగ్గు బట్టీల నిర్వహణ..!

మరిన్ని వార్తలు