Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజాతరలుజిల్లా వార్తలు

Suryapet : పిల్లలమర్రి గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తా.. టూరిజం చైర్మన్..!

Suryapet : పిల్లలమర్రి గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తా.. టూరిజం చైర్మన్..!

సూర్యాపేట, మ న సాక్షి:

శివరాత్రి పర్వదినాన పరమశివుని ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలందరిపై వుండాలని, కాకతీయుల కాలంలనాటి పురాతన శివాలయాలను మహా శివరాత్రి పర్వదినం రోజున సూర్యాపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి దర్శించుకోవడం సంతోషంగా వుందని, తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు.

బుధవారం నాడు మహా శివరాత్రి సందర్భంగా పిల్లలమర్రి గ్రామంలోని పురాతన కాకతీయుల కాలం నాటి శ్రీ ఎరకేశ్వర ఆలయం, మహదేవ నామేశ్వర ఆలయం, చెన్న కేశవ స్వామి ఆలయం, ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయాలను దర్శించి పూజలలో, అభిషేకం కార్యక్రమాలలో పటేల్ రమేష్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలను ఆ మహాదేవుడు చల్లగా చూడాలని అన్నారు. పరమేశ్వరుని ఆశీస్సులతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పధకాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. పర్యాటక శాఖ ద్వారా పిల్లలమర్రి గ్రామంలో పర్యాటక‌ అభివృద్ధి కోసం కోటిన్నర రూపాయలు కేటాయించినట్లు చెప్పారు.

గ్రామంలో స్ధల సేకరణ చేసిన తరువాత టూరిజం అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని అన్నారు. టూరిజం కార్పోరేషన్ ద్వారా ఇంకా రెండు కోట్ల రూపాయలు కేటాయించి పిల్లలమర్రి గ్రామాన్ని ఉత్తమ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ ఊర రామ్మూర్తి, కౌన్సిలర్ ఎడ్ల గంగాభవాని,జ్యోతి కరుణాకర్, గట్టు శ్రీనివాస్, రమేష్ నాయుడు, ఫారూక్, బైరబోయిన శ్రీనివాస్, సైదిరెడ్డి, ,వల్దాసు దేవేందర్, బొలిశెట్టి మధు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

MOST READ :

  1. Indiramma Atmiya Bharosa : రైతు కూలీలకు భారీ గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో డబ్బులు జమ..!

  2. Gold Price : చాలా రోజుల తర్వాత.. భారీగా పడిపోయిన పసిడి ధర..!

  3. Devarakonda : ఉపాధ్యాయులు బాగా చూసుకుంటున్నారా.. గురుకుల హాస్టల్లో అదనపు ఎస్పి ఆరా..!

  4. Phone calls : ఇంతకాలం ఫోన్ కాల్ చేయగానే విన్నది నీ వాయిస్ ఏ నా తల్లి..!

  5. Miryalaguda : రాత్రికి రాత్రే పంట పొలంలో రూ.20 లక్షలు.. నల్గొండ జిల్లా దామరచర్లలో ఘటన..!

మరిన్ని వార్తలు