PMSBY : పీఎం సురక్ష బీమా యోజన.. రూ.20 చెల్లిస్తే చాలు.. 18 ఏళ్లు నిండిన వారంతా అర్హులే..!

PMSBY : పీఎం సురక్ష బీమా యోజన.. రూ.20 చెల్లిస్తే చాలు.. 18 ఏళ్లు నిండిన వారంతా అర్హులే..!
మిర్యాలగూడ, మన సాక్షి:
ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకంపై మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో మెప్మా రిసోర్స్ పర్సన్స్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మున్సిపల్ కమిషనర్ జి. శ్రీనివాస్ మాట్లాడుతూ నల్లగొండ జిల్లా కలెక్టర్ ఆదేశానుసారము ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాన్ని పట్టణంలోని ప్రతి ఒక్కరి తోటి మెప్మా రిసోర్స్ పర్సన్స్ ఎన్రోల్మెంట్ చేయించాలని తెలియజేశారు.
అదేవిధంగా ప్రతి సంవత్సరం ఏడాదికి ప్రీమియం 20 రూపాయలు మాత్రమే చెల్లించాలని అన్నారు. దీనికి 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయస్సు గల వాళ్లందరూ కూడా దీనికి అర్హులు అని అన్నారు .ప్రమాదవశాత్తు రెండు చేతులు రెండు పాదాలను ఉపయోగించలేకపోవడం లేదా ఒక కన్ను చూపు పోవడం లేదా ఒక చేయి లేదా ఒక పాదం ఉపయోగించలేకపోవడం మరియు బీమా పాక్షిక వైకల్యంపై అయితే ఒక చేయలేదు ఒక పాదం ఉపయోగించలేకపోయినట్లైతే వీరికి అర్హత కల్పిస్తామని అన్నారు.
కుటుంబంలో ఎవరికైనా ప్రమాదవశాత్తు మరణం సంబంధించినట్లయితే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి ఈ స్కీమును ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకోవాలన్నారు అదేవిధంగా జూన్ ఒకటో తారీకు నుండి మే 31 వరకు ఈ బీమా కవర్ అందుబాటులో ఉంటుందని తెలియజేశారు.
ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం కింద అమెజాన్, మీ షో , మీ జొమోటో, ఫ్లిప్కార్ట్ తదితర షాపింగ్ మాల్ లో పనిచేస్తున్నటువంటి సేల్స్ మెన్స్ కూడా అర్హులే అని తెలియజేశారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకంలో సభ్యులను చేర్పించేందుకు మున్సిపల్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ జ్ఞానేశ్వరి యూనియన్ బ్యాంకు అధికారి నవీన్, మెప్మా టిఎంసి బక్కయ్య కమ్యూనిటీ ఆర్గనైజర్లు శ్రీనివాస్ పాల్గొన్నారు.
MOST READ :
-
Apollo : ఖచ్చితమైన ఆయుర్వేద చికిత్స కోసం తెలంగాణలోకి అపోలో ఆయుర్వేద్..!
-
Heavy Rain : నల్గొండ జిల్లాలో భారీ వర్షం.. రాకపోకలకు తీవ్ర అంతరాయం..!
-
Nalgonda : మద్యం వ్యాపారులకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బిగ్ షాక్.. టెండర్లు వేసేవారికి సూచనలు..!
-
TG News : తెలంగాణ రాజకీయాల్లో మరో విషాదం.. మాజీ ఎమ్మెల్యే కన్నుమూత..!










