Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంనారాయణపేట జిల్లా

Narayanpet : పోలీసు యాక్ట్ 30, 30 (ఎ) అమలు..!

Narayanpet : పోలీసు యాక్ట్ 30, 30 (ఎ) అమలు..!

నారాయణపేట టౌన్,  మనసాక్షి :

నారాయణపేట జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని ఈ నెల రోజుల ( మార్చ్ 31 వరకు) పాటు జిల్లా వ్యాప్తం గా 30,30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని డి.ఎస్.పి ఎన్. లింగయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిదులు, ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలిలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపినారు. అలాగే ప్రజల శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా మరియు ప్రజా ధనానికి, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాద నీ డి.ఎస్.పి హెచ్చరించారు.

కాబట్టి జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసు వారికి ఇట్టి విషయంలో సహకరించాలని తెలిపారు. ఎలాంటి అనుమతి లేకుండా పై చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టరీత కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డి.ఎస్.పి తెలిపారు.

ALSO READ : Nalgonda : ప్రభుత్వ ఆసుపత్రిలో ముగ్గురు కాంటాక్ట్ ఉద్యోగుల ఆత్మహత్యాయత్నం..!

మరిన్ని వార్తలు