Nalgonda : సంచలనం కలిగించిన కలర్ ల్యాబ్ యజమాని హత్య కేసును చేదించిన పోలీసులు.. నలుగురు అరెస్ట్..!
Nalgonda : సంచలనం కలిగించిన కలర్ ల్యాబ్ యజమాని హత్య కేసును చేదించిన పోలీసులు.. నలుగురు అరెస్ట్..!
నల్లగొండ, మన సాక్షి,
నల్లగొండ జిల్లా కేంద్రంలో సంచలనం కలిగించిన ల్యాబ్ యజమాని సురేష్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈనెల 11వ తేదీ శుక్రవారం నాడు రాత్రి 10.30 గంటల సమయములో నల్లగొండ లో రామగిరి లోని గీతాంజలి అపార్ట్మెంట్ లో యున్న మణికంఠ కలర్ ల్యాబ్ లో జరిగిన ఓ దారుణమైన హత్య కేసును పోలీసులు అత్యంత ప్రతిభతో ఛేదించారు.
బుధవారం నిందితులను అరెస్టు చేసి, వారి నుండి హత్యకు వాడిన వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శరత్చంద్ర పవర్ బుధవారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు .
తన కూతురు సంసారం నాశనం కావడానికి కారణం తన అల్లుడి అన్న గద్దపాటి సురేష్ అనే వ్యక్తి కారణము అని అభిప్రాయం ఏర్పరుచుకున్న మృతుని యొక్క తమ్ముని మామ రిటైర్డ్ ఎక్సైజ్ సిఐ మాతరి వెంకటయ్య, తమ్ముని భార్య గద్దపాటి ఉమా మహేశ్వరి మృతుడిని హత్య చేయించేందుకు గతములో నేవీ లో పని చేసి రిటైర్డ్ అయిన స్కౌట్ డిటెక్టివ్ ఏజెన్సీకి చెందిన చిక్కు కిరణ్ కుమార్ అలియాస్ సీకే. కుమార్ అనే వ్యక్తికి అతని తమ్ముడు ముషo జగదీష్ లకు సుపారి ఇచ్చిహత్య చేయించినట్లు ఎస్పీ తెలిపారు.
హైద్రాబాద్ కొట్టపేటకు చెందిన మాతరి వెంకటయ్య . నాగోల్ కు చెందిన చిక్కు కిరణ్ కుమార్ అలియాస్ కుమార్, కట్టంగూరు మండలం ఈదులూరు కు చెందిన ముషం జగదీష్, హైదరాబాద్ కొత్తపేట కు చెందిన గద్దపాటి ఉమామహేశ్వరి నేరస్తులని ఎస్పీ తెలిపారు.
మాతరి వెంకటయ్య తన కుమార్తె గద్దపాటి ఉమా మహేశ్వరిని నక్రేకల్ పట్టణానికి చెందిన గద్దపాటి నరేష్ అనే యువకుడితో 2017 లో వివాహం చేశాడు. కొన్నాళ్లవరకు సంసారం సజావుగా సాగినప్పటికీ, నరేష్ మరొక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకొని తన భార్యను దూరంగా ఉంచడం ఆమెను శారీరకంగా మానసికంగా హింసకు గురి చేయడము వలన భార్యాభర్తల మధ్య వివాదాలు మొదలయ్యి కేసులు కోర్ట్ లలో నడుస్తున్నవి.
ఈ విషయానికి కారణం అల్లుడి గద్దపాటి నరేష్ అన్న గద్దపాటి సురేష్ కారణం అని అభిప్రాయంతో ఉన్నారు. కాగా అతను మరొక స్త్రీతో చాలా కాలము నుండి సాన్నిహిత్యంగా ఉంటూ తన భార్యకు ధూరంగా వుండేవాడు. సురేష్ తన తమ్ముడు నరేశ్ కూడ అక్రమ సంబంధము కొనసాగించుటకు ప్రోత్సహిస్తున్నాడని, సురేష్ ను ఏ విధంగానైనా తుద ముట్టించినట్లయితే తన అల్లునికి బుద్ది వచ్చి తన కూతురుతో మంచిగా ఉంటాడన్న దురాలోచనతో పధకము వేశారు.
హైదరాబాదులోని కొత్తపేటకు చెందిన – చిక్కు కిరణ్ కుమార్ సంప్రదించి అతని ద్వార నిఘా పెట్టించాడు. దర్యాప్తులో నరేష్ మరో మహిళతో సహజీవనం చేస్తూ ఒక పాపను కన్నాడని సమాచారం రాగా, ఈ తతంగానికి సురేషే ప్రోత్సాహకుడేనని నమ్మిన వెంకటయ్య అతని కూతురు ఉమా మహేశ్వరి ఇద్దరు బలంగా నిర్ణయించుకుని అతన్ని హత్య చేయించాలని నిర్ణయించారు.
ఇట్టి విషయము లో ఇరువురూ కిరణ్ కుమార్ కు చెప్పగా అంధుకు తాను గతములో నేవీ లో కమ్మునికేషన్ వింగ్ లో పని చేసినానని, ఆధారాలు ధోరక్కుండా హత్య ఏ విధంగా చేయాలో తనకు బాగా తెలుసునని తాను (15) లక్షలు రూపాయలు ఇస్తే హత్య చేస్తానని ఒప్పంధము కుదుర్చుకున్నాడు. అంధులో భాగంగా (2) లక్షల రూపాయలు అడ్వాన్స్ ముట్ట చెప్పినారు.
తన పధకములో బాగంగా చిక్కు కిరణ్ కుమార్ ఒక నెల క్రితం తన బంధువు అయిన ముషం జగదీష్‌ను చేరదీసి అతనికి 3 లక్షలు పారితోషికంగా ఇస్తానని ఆశ చూపించి హత్యలో భాగస్వామిగా చేసుకున్నాడు. నెల రోజుల నుండి నల్లగొండ లో తిరుగుచూ గద్దపాటి సురేశ్ కదలికలపై హత్య గురించిరెక్కీనిర్వహించినాడు.
ఈనెల 11న సాయంత్రం కిరణ్ కుమార్ హైదరాబాద్‌లో హత్యకు కావలసిన వస్తువులు (చాకులు, మాస్కులు, టోపీలు, గ్లౌస్ లు ) సిద్దం చేసుకుని కారులో బయలుదేరి నల్గొండకు వచ్చు మార్గ మధ్యములో చెరువుగట్టు సమీపములో అప్పటికే అక్కడికి వేచి చూస్తున్న జగదీష్‌తో కలిసిన తర్వాత, వారు ఇద్దరూ రాత్రి 10:20 గంటలకు నల్లగొండ రామగిరి సెంటర్ లో గల మణికంఠ లేజర్ కలర్ ల్యాబ్ వద్దకు చేరుకున్నారు.
ముందుగా వేసుకున్న పథకములో బాగంగా మృతుడు గద్దపాటి సురేశ్ షాపు వెనుక అప్పటికే పెట్టి ఉంచిన ద్విచక్ర వాహనము తీసుకుని మృతుని షాపు వద్దకు వచ్చి తమకు ఫోటోలు ప్రింట్ కావాలని అడుగగా అతడు రాత్రి అయినధి. రేపు ఉదయము రమ్మని అనగా అర్జెంట్ గా కావాలని మాటల్లో పెట్టి మృతుడు పనిలో నిమగ్నము అయ్యి ఉండగా అధే ఆధునుగా బావించి అతనిపై కత్తులతో దాడి చేసి గొంతు కోసి, వీపు బాగములో మరియు కడుపులో విచక్షణా రహితంగా పొడిచి ధారుణంగా హత్య చేసినారు.
హత్య అనంతరం వారు బైక్ పై చెరువుగట్టు కు వెళ్ళి రక్తం అంటిన బట్టలు, కత్తులు కారులో పెట్టుకొని ముసి వాగు సమీపములో చెట్ల పొదలలో విసిరి వేసి హైదరాబాదు పారిపోయినారు. పై నేరస్తులు లను బుధవారం అరెస్టు చేసి కోర్ట్ లో హాజరు పరిచినట్లు ఎస్పీ తెలిపారు. నేరస్థుల వద్ధ నుండి మారుతి జెన్ కారు ద్విచక్ర వాహనములు – 2, సెల్ ఫోన్ లు – 6 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఇట్టి కేసును నల్లగొండ డి.ఎస్.పి శివరాం రెడ్డి ఆద్వర్యములో నల్లగొండ 2 టౌన్ సీఐ రాఘవరావు, శాలిగౌరారం సీఐ కొండల్ రెడ్డి మరియు నల్లగొండ 1 టౌన్ సీఐ రాజశేకర్ రెడ్డి ఎస్సైలు .సైదులు, సైదాబాబు, విష్ణుమూర్తి మరియు సాయిప్రశాంత్ సిబ్బంది నాలుగు బృందాలుగా ఏర్పడి త్వరితగతిన ఛేదించినారు. వీరిని జిల్లా ఎస్పి అబినందించినారు.
MOST READ :
-
Nalgonda : నల్గొండ కోర్టు సంచలన తీర్పు.. మహిళ పై యాసిడ్ తో దాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు..!
-
ACB : రూ.70వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తిమింగలం..!
-
District SP : పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.. కీలక ఆదేశాలు..!
-
Viral Video : సైబర్ నేరస్థుడికి చుక్కలు చూపించిన అమ్మాయి.. టాలెంట్ కు హ్యాట్సాఫ్.. (వీడియో)
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు భారీ గుడ్ న్యూస్.. మొదటి బిల్లు చెక్కుల పంపిణీ షురూ..!
-
Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఇక ఆ.. రైతుల ఖాతాలలో డబ్బులు..!









