ఆంధ్రప్రదేశ్Breaking Newsక్రైం

Ramasamudram : పోలీసుల సోదాలు.. 20 బైకులు సీజ్..!

Ramasamudram : పోలీసుల సోదాలు.. 20 బైకులు సీజ్..!

రామసముద్రం, మనసాక్షి :

అన్నమయ్య జిల్లా, రామసముద్రం మండల కేంద్రం లోని గాజుల నగరంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. మంగళవారం ఉదయం సబ్ డివిజన్ డీఎస్పీ మహేంద్ర ఆదేశాల మేరకు సీఐ సత్యనారాయణ ఎస్సైలు రవికుమార్, దిలీప్ కుమార్, తిప్పే స్వామి, పోలీస్ సిబ్బంది తో కలిసి ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. ఇందులో భాగంగా గల్లీ, గల్లీని, ప్రతి ఇంటిని తనిఖీలు చేశారు.

ఈ కార్డెన్ సెర్చ్ లో సీఐ మాట్లాడుతూ తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రోత్సహించొద్దని కోరారు.యువత అతి వేగంగాతో వాహనాలను నడపొద్దన్నారు. అలాగే ప్రమాదాల బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచనలు చేశారు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని సూచించారు.

అలాగే చదువు పై దృష్టి సారించి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. కార్డెన్ సెర్చ్‌లో భాగంగా సరైన పత్రాలు లేని 20 బైకులు, టాటా ఏసీ ని సీజ్ చేశారు. గ్రామాల్లోని సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు, ప్రజా ప్రతినిధులు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్డెన్ సెర్చ్‌లో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Gold Offers : అక్షయ తృతీయకు అదిరిపోయే బంగారం ఆఫర్లు.. తెలుసుకోండి ఇవే..! 

  2. Gold Price : గోల్డ్ మళ్లీ డమాల్.. ఈరోజు తులం ఎంతంటే..!

  3. District SP : వేసవి సెలవుల నేపథ్యంలో విద్యార్థులకు జిల్లా ఎస్పీ కీలక సూచనలు..!

  4. District collector : సారూ.. మాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తే కట్టుకుంటాం.. జిల్లా కలెక్టర్ ను వేడుకున్న నిరుపేద..!

మరిన్ని వార్తలు