క్రైంBreaking Newsనల్గొండ

Nalgonda : 24 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు..!

Nalgonda : 24 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు..!

నల్లగొండ, మనసాక్షి:
ఈనెల 17వ తేదీ మధ్యాహ్నం సమయంలో నకిరేకల్ పట్టణంలోని వి‌టి కాలనీ నందు నివాసం ఉంటున్న నాగులవంచ లక్ష్మమ్మ అను పేరు గల 75 సంవత్సరాల వృద్దురాలిని గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి ఒంటరిగా వున్నా వృద్దురాలిని కట్టేసి, చేతులతో కొట్టి గాయపరచి  ఒంటి మీద ఉన్న మూడు తులాల పుస్తెల త్రాడును, నాలుగు రోల్డ్ గోల్డ్ గాజులను దొంగిలించారు.
కేసు పై వచ్చిన ఫిర్యాదు మేరకు  నల్లగొండ డి‌ఎస్‌పిశివరాం రెడ్డి  పర్యవేక్షణలో నకిరేకల్ సి.ఐ రాజశేఖర్  ఆధ్వర్యంలో  బి.లచ్చిరెడ్డి, ఎస్.ఐ., నకరేకల్ పోలీస్ స్టేషన్,  డి.సైదులు, ఎస్.ఐ., శాలిగౌరారం పోలీస్ స్టేషన్,  బి.సాయి ప్రశాంత్, ఎస్.ఐ., తిప్పర్తి తో మూడు ప్రత్యేక బృందాలతో వేర్వేరు ప్రదేశాలలో నేరస్తుల కొరకు తనిఖీలు నిర్వహించడం జరిగిందని డిఎస్పి శివరాం రెడ్డి తెలిపారు సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ
ప్రత్యేక బృందాలు నిర్వహించిన వాహన తనిఖీలలో భాగంగా, ఈనెల 18న సాయంత్రం తిప్పర్తి ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద ఒక హోండా యాక్టివా మోటార్ సైకిల్ పైన వెళుతున్న ఇద్దరు వ్యక్తులు పోలీసు వారిని చూసి తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నించగా, అనుమానం కలిగి, వెంటపడి పట్టుకొని తనిఖీ చేయగా వారి దగ్గర ఒక పుస్తెల త్రాడు దొరికింది. తదుపరి విచారణలో సదరు వ్యక్తులు తేది 17న రోజున వి.టి. కాలని, నకరేకల్ లోకూడ దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.
నకేరేకల్లో వృద్ధురాలి ఇంట్లోకి వెళ్లి కిరాయికి ఏమైనా రూమ్ ఖాళీగా ఉన్నాయా అని అని అడుగగా, ఖాళీ లేదని చెప్పడంతో,త్రాగడానికి నీళ్ళు కావాలని అడుగగా, సదరు వృద్ధురాలు నీళ్ళు తీసుకొని రావడానికి లోనికి వెళ్ళిన సమయంలో, ఆమె ఇంటి లోనికి జొరబడి, ఆమెను ఒక దుప్పటిని చింపి దానితో, ఆమె మూతిని, కాళ్ళు, చేతులు కట్టివేసి, చేతులతో ఆమె మొఖం పైన పిడి గుద్దులు గుద్ది, ఆమె ఒంటి పైన వున్నాఒక బంగారం చైను, చేతికి వున్నా గాజులు (రోల్డ్ గోల్డ్) గుంజుకొని పారిపోయినట్లు తెలిపినారు.

MOST READ :

మరిన్ని వార్తలు