Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణవిద్య
పేదరికానికి చదువు అడ్డు కాదు..!
చదువుకు పేదరికం అడ్డు కాదని నిరూపించింది ఓ పేద విద్యార్థిని.

పేదరికానికి చదువు అడ్డు కాదు..!
అనంతగిరి, మన సాక్షి:
చదువుకు పేదరికం అడ్డు కాదని నిరూపించింది ఓ పేద విద్యార్థిని. అనంతగిరి మండలం పాలవరం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ షేక్ షరీఫ్ కుమార్తె షేక్ నౌషీన్ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో సత్తా చాటింది. ఖమ్మంలో ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న ఆమె 1000 మార్కులకు గాను 993 మార్కులు సాధించి అందరి ప్రశంసలను అందుకుంది.తండ్రి కష్టాన్ని అర్థం చేసుకుని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కృషితో ముందుకు సాగిన నౌషీన్ ఈ విజయాన్ని సాధించడం విశేషం. ఆమె పట్టుదల,శ్రమకు గ్రామస్థులు, ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేస్తున్నారు. భవిష్యత్తులో ఇంకా ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆశిస్తున్నారు.









