నారాయణపేటలో విద్యుత్ అంతరాయం… ప్రాంతాలు ఇవే..!
నారాయణపేటలో విద్యుత్ అంతరాయం… ప్రాంతాలు ఇవే..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
జిల్లా కేంద్రం లోని ఉప విద్యుత్ కేంద్రంలో 11. కె.వి ఫీడర్ లో శనివారం (నేడు) మరమ్మత్తుల కారణంగా ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ మహమ్మద్ రఫీ తెలిపారు.
చిన్న పిల్లల ఆసుపత్రి ఫీడర్ కింద పాత బస్టాండ్, మనోహర్ థియోటర్, హాజీ ఖాన్ పెట్, రవితేజ స్కూల్ ఏరియా ఆర్డీవో ఆఫీస్, మ్యాదర్వాడి ప్రభుత్వ హాస్పిటల్, పళ్ళ, వెజిటేబుల్ మార్కెట్, మహంకాళి స్ట్రీట్, కిందిగేరి, ఓపెన్వెల్ జంగిటి గడ్డ, శివాజీ నగర్, అలాగే యాదగిరి రోడ్డు ఫీడర్ కింద ప్రతిభ కాలేజ్ బ్యాక్ సైడ్, శాతవాహన కాలనీ, గురుకుల స్కూల్, సత్యనారాయణ టెంపుల్ ఏరియా, పళ్ళ ఎక్లాస్పూర్ రోడ్డు ప్రాంతాలలో విద్యుత్ కు అంతరాయం ఉంటుందని కావున విద్యుత్ వినియోగ దారులు మరియు వ్యాపారస్తులు ఈ అంతరాయానికి సహకరించాలని ఏఈ కోరారు.









