Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

ప్రధాన మంత్రి ధన్ ధన్య యోజన పథకం.. రైతులకు ఎంతో మేలు, సద్వినియోగం చేసుకోవాలి..!

ప్రధాన మంత్రి ధన్ ధన్య యోజన ప్రత్యేక అధికారి భారత ప్రభుత్వ ఆయిల్‌సీడ్స్ పరిశోధన డైరెక్టర్‌ డా. పొన్నుస్వామి గురువారం నారాయణపేట జిల్లాను సందర్శించారు.

ప్రధాన మంత్రి ధన్ ధన్య యోజన పథకం.. రైతులకు ఎంతో మేలు, సద్వినియోగం చేసుకోవాలి..!

నారాయణపేట టౌన్, మనసాక్షి:-

ప్రధాన మంత్రి ధన్ ధన్య యోజన ప్రత్యేక అధికారి భారత ప్రభుత్వ ఆయిల్‌సీడ్స్ పరిశోధన డైరెక్టర్‌ డా. పొన్నుస్వామి గురువారం నారాయణపేట జిల్లాను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ తో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో పీఎండీడీకే వై పథకం అమలు పురోగతిని సమగ్రంగా పరిశీలించారు.

జిల్లా స్థాయి అధికారులు పథకం అమలుపై వివరాలను శాఖల వారీగా నివేదించగా డా. పొన్నుస్వామి కార్యక్రమం మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచనలు చేశారు. పథకం మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి అవసరమైన ప్రతిపాదనలను శాఖల వారీగా పంపించాలని ఆదేశించారు. ఆ పథకం పరిధిలోని వ్యవసాయ, మత్స్య, పాడి పరిశ్రమ, కో-ఆపరేటివ్, గ్రామీణాభివృద్ధి, ఉద్యాన శాఖల అధికారులతో సుదీర్ఘంగా చర్చించి, అమలు కు అవసరమైన సలహాలు ఇచ్చారు.

అంతకు ముందు డా.పొన్ను స్వామి మరికల్ మండలంలోని కూరగాయలు, ఆయిల్ పామ్, మొక్క జొన్న పంట పొలాలను సందర్శించి, రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. పంటల స్థితిగతులు, సాగు పద్ధతులు, ఉత్పాదకత, ఎదురవుతున్న సమస్యలు వంటి అంశాలపై రైతుల అభిప్రాయాలు తెలుసుకుని, అధికారులతో చర్చించి సూచనలు అందించారు. పథకం అమలుపై జిల్లా అధికారులు, రైతుల నుంచి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానశాఖ అధికారి సాయిబాబా, డిఆర్డిఓ మొగులప్ప, జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, కోపరేటివ్ జిల్లా అధికారి ప్రసాద్ రావు, జిల్లా వెటర్నరీ & పశుసంవర్ధక అధికారి ఈశ్వర్ రెడ్డి, నాబార్డ్ ఏజీఎం షణ్ముఖ చారి, ఎల్డీఎం విజయకుమార్, డిపిఓ సుధాకర్ రెడ్డి, సైంటిస్ట్ రాజేంద్ర కుమార్, సమితి సభ్యులు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

ఇవీ చదవండి : 

మరిన్ని వార్తలు