తెలంగాణజిల్లా వార్తలుసంగారెడ్డి జిల్లా

Pure EV: ప్యూర్ ఈవీ మరో షోరూం ప్రారంభం..!

Pure EV: ప్యూర్ ఈవీ మరో షోరూం ప్రారంభం..!

సంగారెడ్డి, మన సాక్షి :

తెలంగాణలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేస్తూ, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ఎనర్జీ స్టోరేజ్ ఉత్పత్తుల సంస్థ ప్యూర్(Pure EV), సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నూతన షోరూమ్‌ను ప్రారంభించింది. ఎలక్ట్రిక్ స్కూటర్లు, మోటర్‌సైకిళ్లు, ప్యూర్‌పవర్ ఉత్పత్తులతో పాటు ఆఫ్టర్-సేల్స్ సపోర్ట్‌ను అందించేలా ఈ షోరూమ్ డిజైన్ చేశారు.

పర్యావరణ హిత మొబిలిటీ ఉత్పత్తులను కీలక మార్కెట్లలో అందుబాటులోకి తీసుకురావడానికి ఈ విస్తరణ సహాయపడుతుంది. ప్రారంభోత్సవంలో సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్యూర్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీ రోహిత్ వదేరా మాట్లాడుతూ.. “సంగారెడ్డిలో నూతన షోరూమ్ ప్రారంభంతో తెలంగాణలో మా సేవలను విస్తరించడం సంతోషకరంగా ఉంది. హైదరాబాద్‌లో స్థాపితమైన సంస్థగా, ఈ ప్రాంతాన్ని ఎలక్ట్రిక్ మొబిలిటీ కేంద్రంగా తీర్చిదిద్దడంలో భాగస్వామ్యం అవ్వడం గర్వకారణం. పర్యావరణ హిత రవాణా డిమాండ్‌ను తీర్చేందుకు, ప్యూర్‌పవర్ ఉత్పత్తుల ద్వారా సంగారెడ్డి, పొరుగు జిల్లాలకు సరికొత్త ఆవిష్కరణలను అందిస్తాం” అని పేర్కొన్నారు.

MOST READ : 

  1. UTI: యూటీఐ మల్టీ క్యాప్ ఫండ్‌ను ప్రారంభించిన యూటీఐ మ్యూచువల్ ఫండ్..!

  2. Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అవకతవకలు.. జడ్పీ సీఈఓ కు ఫిర్యాదు..!

  3. District collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. రోగుల పట్ల దురుసుగా ప్రవర్తించిన డాక్టర్ సరెండర్..!

  4. Gold Offers : అక్షయ తృతీయకు అదిరిపోయే బంగారం ఆఫర్లు.. తెలుసుకోండి ఇవే..! 

మరిన్ని వార్తలు