Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ఆంధ్రప్రదేశ్Breaking Newsక్రైం

Ramasamudram : రామసముద్రం ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన హృషికేశవరెడ్డి.. ఎవరంటే..! 

అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం పోలీస్ స్టేషన్ నూతన ఎస్సై గా హృషికేశవరెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు.

Ramasamudram : రామసముద్రం ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన హృషికేశవరెడ్డి.. ఎవరంటే..! 

రామసముద్రం, మనసాక్షి :

అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం పోలీస్ స్టేషన్ నూతన ఎస్సై గా హృషికేశవరెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. స్టేషన్ సిబ్బంది ఆయనకు ఘనస్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఎస్సై హృషికేశవరెడ్డి మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఈ బాధ్యతలను అప్పగించిన ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన పరిధిలో శాంతిభద్రతలను కాపాడటమే తన ప్రధాన లక్ష్యమని, అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి బాధితుడి పట్ల గౌరవంగా వ్యవహరిస్తామని, ప్రజలు ఎటువంటి భయం లేకుండా తమ సమస్యలను తమ దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు.ముఖ్యంగా మహిళలు, పిల్లల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, నేరాలు జరగకుండా నివారణ చర్యలను పటిష్టం చేస్తామని పేర్కొన్నారు. స్టేషన్ పరిధిలోని సిబ్బందితో సమన్వయంతో పనిచేస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సైకి అభినందనలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు