Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Miryalaguda : తీన్మార్ మల్లన్నపై బీసీల తిరుగుబాటు.. మిర్యాలగూడలో భారీగా నిరసన ర్యాలీ..!

Miryalaguda : తీన్మార్ మల్లన్నపై బీసీల తిరుగుబాటు.. మిర్యాలగూడలో భారీగా నిరసన ర్యాలీ..!

మిర్యాలగూడ, మన సాక్షి :

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పై బీసీలు తిరుగుబాటు చేశారు. గత కొద్ది రోజులుగా బీసీల కోసం తీన్మార్ మల్లన్న గళం విప్పి పోరాడుతున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవల మిర్యాలగూడలో బీసీ గర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు.

బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ నాయకుల పై ఆయన విరుచకపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి, మిర్యాలగూడ శాసనసభ్యులు భత్తుల లక్ష్మారెడ్డి లపై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.

దాంతో మిర్యాలగూడ బీసీ కాంగ్రెస్ నాయకులు తీన్మార్ మల్లన్నకు వ్యతిరేకంగా భారీ ప్రదర్శన నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశమైన బీసీ నాయకులు నోటికి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన చేశారు.

తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలపై వారు మండిపడ్డారు. తక్షణమే పార్టీ అధిష్టానం స్పందించి మల్లన్న పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

నిరసన ప్రదర్శనలో డిసిసి కార్యదర్శి చిలుకూరి బాలు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిల శ్రీనివాస్, బీసీ నాయకులు బంటు లక్ష్మీనారాయణ, బాలుగూరి శ్రీనివాస్, కాకునూరి బసవయ్య తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు