viralBreaking Newsజాతీయం

Viral Video : రీల్స్ పిచ్చి.. ప్రమాదం కూడా గుర్తించని మహిళ.. (వీడియో)

Viral Video : రీల్స్ పిచ్చి.. ప్రమాదం కూడా గుర్తించని మహిళ.. (వీడియో)

మన సాక్షి , వెబ్ డెస్క్:

రీల్స్ పిచ్చిలో పడి ఏం చేస్తున్నామో అనే ఆలోచన కూడా లేకుండా పోతుంది యువతకు. తాము చేసే రీల్స్ వైరల్ కావాలని ఏదేదో చేస్తుంటారు.. అలాంటివి కొన్ని ప్రాణాల మీది కూడా వస్తున్నాయి. రీల్స్ పిచ్చిలో పడి కొంతమంది ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారు.

అయినా.. కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఓ మహిళ రీల్స్ చేస్తుండగా చీరకు నిప్పు పట్టుకొని ప్రమాదం సంభవించింది. రీల్స్ షూట్ చేస్తున్న వ్యక్తి కూడా దీనిని గమనించలేదు. రీల్స్ చేస్తుండగా పక్కనే పొయ్యి ఉండడంతో చీరకు నిప్పు అంటుకొని ప్రమాదం సంభవించింది.

వెంటనే ఆమె అరుపులు, కేకలు వేయడంతో పక్కన వారు వచ్చి మంటలు ఆర్పారు.ఈ వీడియో వైరల్ గా మారింది. చూసినవారు వివిధ రకాల కామెంట్స్ పెడుతున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు