మొన్న మరమ్మత్తులు.. నేడు పగుళ్లు..!
మొన్న మరమ్మత్తులు.. నేడు పగుళ్లు..!
కురవి , మనసాక్షి :
ఇటీవల కురిసిన భారీ వర్షానికి తెలంగాణ ప్రభుత్వం తక్షణ మరమ్మత్తులకు నిధులు మంజూరు చేసిన విషయం విధితమే. అయితే మహబూబాబాద్ జిల్లా కురవి పెద్ద చెరువు సీసీ రోడ్డు వర్షానికి కొట్టుకపోవడంతో తక్షణ నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే రామచంద్రనాయక్ ఆదేశాలతో మరమ్మత్తుల నిర్మాణం కొరకు పంచాయతీ కార్యాలయం నుండి కొంత నిధులు మంజూరు చేసి మట్టి రోడ్డును ఏర్పాటు చేశారు.
రోడ్డు నిర్మించిన వారంలోనే చిన్నపాటి వర్షానికి మట్టి రోడ్డు పూర్తిగా పగుళ్లు వచ్చి ఎప్పుడు కులుతుందోనని సందేహంగానే ఉంది. దీంతో నాణ్యమైన రోడ్డు నిర్మించాల్సిందని తక్షణ నిర్మాణం కొరకు ఏర్పాటు చేసిన నిధులు నీటిపాలైందని పలువురు విమర్శిస్తున్నారు.
నిర్మాణమైన వారంలోనే రోడ్డు ఈ విధంగా రోడ్డు నెర్రబారి దర్శనమివ్వడంతో ఇబ్బడి ముబ్బడిగా మట్టి పోసి తూ..తు.. మంత్రంగా మరమత్తు చేసినట్లుగా ఉందని దీంతోనే ఈ నెర్రభారిన ఘటన జరిగిందని విమర్శిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇంకొద్ది రోజుల్లో జరిగే దేవీ నవరాత్రి ఉత్సవాలకు భక్తులకు ఇబ్బందికరంగా మారుతుందని స్థానికులు వాపోతున్నారు. ఇకనైనా గుత్తే దారులు పటిష్టమైన రోడ్డు నిర్మాణం చేపట్టాలని లేనియెడల బాధ్యులపై అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
MOST READ :
-
TG News : చెరువులోనే మూడంతస్తుల భవనం.. బాంబులతో పేల్చివేసిన అధికారులు.. (వీడియో)
-
District Collector : లేఔట్లలో నిబంధనలు పాటించాలి.. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్..!
-
Vegetables : బెండకాయ కొందరికి హానీకరం, మరికొందరికి ప్రయోజనం.. ఆలస్యం కాకముందే ఎందుకో తెలుసుకోండి..!
-
Tomato Juice : తినడానికి బదులు టమోటా రసం తాగండి.. 30 రోజుల్లో ఈ 5 అద్భుతమైన ప్రయోజనాలు..!









