Rythu Bharosa : రైతు భరోసాకు పరిమితులు విధించాలి.. అభిప్రాయ సేకరణలో రైతుల వెల్లడి.!
Rythu Bharosa : రైతు భరోసాకు పరిమితులు విధించాలి.. అభిప్రాయ సేకరణలో రైతుల వెల్లడి.!
నేలకొండపల్లి, మన సాక్షి :
రైతు భరోసా రైతులకు ఉపయోగమైనప్పటికీ పది ఎకరాల లోపు పరిమితం చేయాలని పలువురు రైతులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని రైతు వేదిక లో సోమవారం రైతు భరోసా పై రైతుల అభిప్రాయ సేకరణ కార్యక్రమంను నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడారు… కొంత మంది రైతులు ఐదు, పది ఎకరాల రైతులకు మాత్రమే ఇవ్వాలని అభిప్రాయం ను వ్యక్తం చేశారు. మరి కొంత మంది సాగు చేసే భూములకు మాత్రమే ఇవ్వాలని కోరారు. కౌలు రైతులకు ఇవ్వాలని, రైతులకు సబ్సీడీ పై ఎరువుల ను ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా హన్మకొండ డిప్యూటీ రిజిష్టార్ యం.నీరజ మాట్లాడారు.
రైతుల అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి అరుణకుమారి, సోసైటీ డైరెక్టర్ మైశా శంకర్, తీగ రమణయ్య, కనకబండి కనకరాజు అనిల్. రైతులు ఏటుకూరి. రామారావు, యం.కోటేశ్వరరావు, కడియాల నరేష్, నాగేశ్వరరావు ఏఈవో లు తదితరులు పాల్గొన్నారు.
ALSO READ :









