Breaking NewsTOP STORIESక్రైంనల్గొండ

రైస్ పుల్లింగ్ చెంబు పేరుతో బురిడి కొట్టిస్తున్న గ్యాంగ్ అరెస్ట్

రైస్ పుల్లింగ్ చెంబు పేరుతో బురిడి కొట్టిస్తున్న

గ్యాంగ్ అరెస్ట్

నల్గొండ , మే 30, మనసాక్షి: రైస్ పుల్లింగ్ మహిమగల చెంబు పేరుతో బురిడీ కొట్టించే ఐదుగురి గ్యాంగ్ ని సోమవారం నల్గొండ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో హైదరాబాద్ కు చెందిన ఆరోజు లక్ష్మీనారాయణ కొండారపు నాగరాజు, మురళి మనోహర్ , లక్ష్మణ్ నాయక్, మహబూబ్నగర్ జిల్లాకు చెందిన సందుల రవి ఉన్నారు. మరో ఇద్దరు శర్మ, పరశురాములు పరారీలో ఉన్నారు. వీరంతా సులభంగా డబ్బులు సంపాదించాలనే పథకం ప్రకారం రైస్ పుల్లింగ్ మహిమగల చెంబు తమ వద్ద ఉన్నదని కొంతమందికి ఫోన్లు చేసి అడిగి వారికి అమ్మేవారు. వీరిని నల్గొండ పట్టణంలో పానగల్ బైపాస్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుకున్నారు. ఇటీవల కాలంలో నల్లగొండ పట్టణానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి నుంచి 4 లక్షల 60 వేల రూపాయలు తీసుకొని మోసం చేయగా శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు వీరిని చేధించి అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఇన్నోవా కారు, 5 సెల్ ఫోన్లు, 3 చెంబులు టార్చ్ లైట్, 9 కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నిందితుల్లో ఆరోజు లక్ష్మీనారాయణ గ్రూపు లీడర్ గా కొన్ని సిమ్ములు తీసుకుని మరో నిందితుడు శౌరి ద్వారా నల్గొండ కు చెందిన శ్రీనివాస్ కు ఫోన్ చేయిస్తాడు. తనకు పొలంలో రైస్ పుల్లింగ్ చెంబు దొరికిందని శ్రీనివాస్ కు చెబుతాడు. దాని గురించి తెలిసినవారికి అమ్మితే కోటి రూపాయల లాభం వస్తుందని ఆశ చూపిస్తాడు. ఆ తర్వాత మరో వారం రోజుల తర్వాత మరో నిందితుడు నాగరాజు శ్రీనివాస్ కు ఫోన్ చేసి రైస్ పుల్లింగ్ శంభు తనకు కావాలని అడుగుతాడు. దాంతో శ్రీనివాస్ తన వద్ద ఉన్నదని చెప్పగా నాగరాజు తన కంపెనీకి సంబంధించిన పరికరం తో టెస్ట్ చేస్తానని నమ్మిస్తాడు. మరో నిందితుడు మురళి అనే వ్యక్తి ద్వారా అక్కడికి వెళ్లి చెంబు పై టార్చ్ లైట్ వేసి ఇది పనికి వస్తుందని, హైదరాబాద్ తీసుకురావాలని చెప్పగా సరే అని ఒప్పుకుంటాడు. ఈ విషయాన్ని లక్ష్మీ నారాయణ కి ఫోన్ ద్వారా తెలియజేయగా అతను హైదరాబాదుకు రావటం కుదరదని, మాకు తెలిసిన మరో నిందితుడు లక్ష్మణ్ కు ఇచ్చి పంపిస్తా అని చెబుతాడు. దానికి 9 లక్షల రూపాయలు ఇవ్వాలని మాట్లాడుకుంటారు. ఏప్రిల్ 11వ తేదీన నిందితులు లక్ష్మణ్, రవి లకు అనుకున్న ప్రకారం మల్లె పెళ్లి లోని ఓ లాడ్జిలో శ్రీనివాస్ కు చెంబు అప్పగిస్తారు. దానికి శ్రీనివాస్ 4 లక్షల 60 వేల రూపాయలు చెల్లిస్తాడు. కాగా ఆ తర్వాత శ్రీనివాస్  వాళ్లకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దాంతో ఈనెల 26వ తేదీన నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు చేయగా పోలీసులు విచారణ చేపట్టారు.

ఇవి కూడా చదవండి

1. సివిల్స్ లో అమ్మాయిలు టాప్

2. విజయవంతమైన రెడ్డి సింహ గర్జన సభ, మంత్రి మల్లారెడ్డికి చేదు అనుభవం

మరిన్ని వార్తలు