Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. కలెక్టర్ ఔదార్యం.. అయినా తీవ్ర గాయాలు కావడంతో  దుర్మరణం..!

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి తీవ్ర గాయాల పాలై రక్తపు మడుగులో పడి ఉన్న క్షతగాత్రుడి పట్ల నల్లగొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తన ఔదార్యాన్ని చాటుకున్నాడు.

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. కలెక్టర్ ఔదార్యం.. అయినా తీవ్ర గాయాలు కావడంతో  దుర్మరణం..!

కనగల్, మన సాక్షి :

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి తీవ్ర గాయాల పాలై రక్తపు మడుగులో పడి ఉన్న క్షతగాత్రుడి పట్ల నల్లగొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. నల్లగొండ జిల్లా, కనగల్ మండలం ధర్వేశిపురం స్టేజి సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. కనగల్ మండల కేంద్రానికి చెందిన ఏటెల్లి పరశురాం(30) బైక్ పై నల్లగొండకు వెళుతుండగా మార్గమధ్యలో ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కావడంతో పరుశురాం ఘటనా స్థలంలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. పర్యటన ముగించుకొని అదే మార్గంలో నల్లగొండకు వెళుతున్న కలెక్టర్ ఘటనా స్థలంలో ఆగారు. అప్పటికే క్షతగాత్రుడు తీవ్ర గాయాలతో పడి ఉండడాన్ని గమనించిన కలెక్టర్ వాహనం దిగి స్వయంగా 108 కు ఫోన్ చేశారు.

108 వాహనం వచ్చే వరకు అక్కడే ఉండి బాధితుడిని 108 లో ఎక్కించారు. కలెక్టర్ సమయస్ఫూర్తిని ఉదారతను స్థానికులు కొనియాడారు. కాగా అప్పటికే తలకు తీవ్ర గాయాల పాలైన పరుశురాం ఆసుపత్రికి తరలించే లోపే మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

  1. Miryalaguda : మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట.. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
  2. BREAKING : సూర్యాపేటలో ప్రేమోన్మాది ప్రియురాలు పై సుత్తితో దాడి.. స్థానికులు దేహశుద్ధి..!
  3. Nalgonda : రెండేళ్లలో నల్లగొండ స్మార్ట్ సిటీ, ఎలా ఉంటుందో చూపిస్తా.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!
  4. TNGO : నారాయణపేట జిల్లా TNGO నూతన కార్యవర్గం ఏకగ్రీవం..!

మరిన్ని వార్తలు