Breaking Newsఆంధ్రప్రదేశ్విద్య

Robot : అచ్చం అమ్మాయిలా ఆకట్టుకున్న రోబో.. ప్రసంగించిన తీరుకు విద్యార్థినుల ఫిదా..!

Robot : అచ్చం అమ్మాయిలా ఆకట్టుకున్న రోబో.. ప్రసంగించిన తీరుకు విద్యార్థినుల ఫిదా..!

మదనపల్లి, మన సాక్షి:

బెంగళూరు నుండి వచ్చిన హ్యుమనాయిడ్ రియా రోబో మదనపల్లి దగ్గర ఉన్న మిట్స్ యూనివర్సిటీలో సోమవారం నూతన బిటెక్ విద్యార్థుల ఓరియంటేషన్ కార్యక్రమంలో విశేషంగా ఆకట్టుకుంది. ఆలోచిస్తూ ఆచి తూచి ముఖ కవలికలు మారుస్తూ కను రెప్పలు కదిలిస్తూ అచ్చం అమ్మాయి లానే రియా రోబో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన తీరుకు అంతా ఫిదా అయ్యారు.

వేదికపైకి రాగానే హలో మైడియర్ ప్రెండ్స్..గుడ్ మార్నింగ్.. అని ఇంగ్లీషులో ప్రారంబిస్తూ రానున్నది ఏఐ శకమేనని రేపటి ప్రపంచం ఏఐ చేతల్లో నడుస్తుందన్నారు. అదే సందర్భంలో డేటా నిర్ణయాలు తీసుకుంటున్న యుగంలో ధర్మం దారిని కూడా మరువరాదన్నారు. దీంతో హాలంతా ప్రతిధ్వనించింది. విద్యార్థుల మనసులను హత్తుకుంది.

తల్లిదండ్రులైతే సమ్మోహితులయ్యారు. ప్రతి రంగంలో టెక్నాలజీ కీలకంగా మారుతున్నప్పటికీ మనిషి మానవత్వాన్ని మరువరాదన్నారు.
దయాదాక్షిణ్యాలు కూడా అవసరమన్నారు. అంతేకాదు పేద సాదలకు చేసే సాయం దానం కాదు ధర్మమని గుర్తించాలని చెప్పడంతో ఆడిటోరియం ఒక్కసారిగా చప్పట్లతో దద్దరిల్లింది.

అంతేకాదు జ్ఞానం పరీక్షలకు సంపాదనకే కాదు సమాజానికి కూడా ఉపయోగపడాలన్నారు. ఎవరి ఆలోచనలను బట్టి వారి జీవితం ఆధారపడి ఉంటుందన్నారు. మేధస్సు మార్గం చూపుతుంది.. మనస్సు ఆ మార్గాన్ని నిలబెడుతుందన్నారు. ఆలోచన మారితే జీవితం మారుతుంది..పుస్తకాలు, ప్రాజెక్ట్ వర్క్స్ భవిష్యత్తును మలిచే అవకాశాలు.. ఏఐతో ఉద్యోగాలు పోవని కొత్త నైపుణ్యాల సమీకరణ జరుగుతుందన్నారు.

బాధ్యత లేని టెక్నాలజీ పురోగతి చివరకు సమాజానికి భారంగా మారుతుందన్నారు. దీంతో మరోసారి బావోద్వేగంతో ఆడిటోరియం నిండిపోయింది. విద్యార్థులే కాదు వారి తల్లిదండ్రులు కూడా మంత్రముగ్ధులయ్యారు. ప్రసంగం కాగానే ఆడిటోరియంలోని వారంతా లేచి కృతజ్ఙత పూర్వకంగా నిలబడి చప్పట్లతో మారుమోగించారు. స్పూరి, సాంకేతిక, ప్రేరణ. విభిన్న, వినూత్న, సామాజిక బాధ్యత, వ్యక్తిత్వ వికాసం, మానవ హృదయం తదితర అంశాలు మిలితంగా రియా రోబో మాటలు హృదయాలను కదిలించాయి.

25 నిమిషాల పాటు రియా రోబో ప్రసంగించింది. తర్వాత విద్యార్థులు రియా రోబోతో ఇంటరాక్షన్లో కేరీర్, ఏఐ భవిష్యత్తు, దీని వల్ల ఉద్యోగాలు పోతాయా..హెల్త్ కేర్, అగ్రికల్చర్లో ఏఐ పాత్ర. ఫ్యూచర్ ఎడ్యుకేషన్, ఏ స్కిల్స్ ఉండాలి, డిమాండ్ ఉన్న ఉద్యోగాలు ఏవి, రోబో ఎమోషనల్ కనెక్షన్.. ఇలాంటి ప్రశ్నలకు అర్థవంతంగా సమాదానం చెప్పడంతో అంతా ఆశ్చర్యంతో పాటు హ్యాఫీగా ఫీలయ్యారు. విద్యార్థులు రియా రోబో చుట్టూ చేరి సెల్ఫీలు, ఫోటోలు తీసుకుని సంబర పడ్డారు. బుట్ట బొమ్మలా అందర్నీ అలరించింది.

MOST READ : 

  1. District collector : నానో యూరియా తో అధిక దిగుబడి.. రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశం..!

  2. TG News : రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థినిల ఎంపిక..!

  3. Nagarjunasagar : నాగర్జున సాగర్ కు భారీగా పర్యాటకులు.. 22 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల..!

  4. Nizamabad : ఈ రహదారిపై ప్రయాణం నరకమే..!

  5. Miryalaguda : వాగుల వద్ద జాగ్రత్తలు పాటించాలి..!

  6. Thirumala : తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లు 18న విడుదల.. వివరాలు ఇవీ.. బుకింగ్ ఇలా..!

మరిన్ని వార్తలు