క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

District SP : విదేశాల్లో ఉండి రాకెట్.. మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో మోసాలు.. జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్..!

District SP : విదేశాల్లో ఉండి రాకెట్.. మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో మోసాలు.. జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

ప్రజల సొమ్ము దోచుకోనేందుకు సైబర్‌ నేరగాళ్ళు రోజు, రోజుకి కొత్త కొత్త పోకడలతో ప్రజల బలహీనతలను పెట్టుబడిగా చేసుకోనేందుకు సైబర్‌ నేరగాళ్లు కొత్త పంథాలను ప్రయోగిస్తున్నారనీ, మోసపూరిత వాగ్దానాలు, ప్రకటనలతో మోసాలకు పాల్పడుతున్న మల్టీ లెవెల్‌ మార్కెటింగ్‌ స్కీముల పట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్  ఒక ప్రకటనలో తెలిపారు.

గొలుసుకట్టు వ్యాపారాలు చేస్తూ ప్రజలను మోసం చేసే మల్టిలెవెల్ వ్యాపారాలు పెరుగుతున్నాయనీ, నిత్యవసర సరుకులు, గృహోపకరణాలు, వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులు, క్రిప్టో కరెన్సీ మొదలగు వాటి పేర్లు చెప్పి ప్రజలను ఆర్థిక మోసాలకు గురిచేసే మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు.

మీ క్రింద ఎక్కువ మంది ఎజెంట్లను చేర్పించి తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు పొందండి అనే వాటిని నమ్మవద్దు అని ఎస్పీ అన్నారు. ఇలాంటి మల్టీలెవల్ వ్యాపారం చేస్తూ ప్రజల నుండి డబ్బులు సేకరించి ఆర్దికంగా మోసం చేస్తూ చైన్ సిస్టం మార్కెటింగ్ వ్యాపారాల ద్వారా ఆర్థికపరమైన మోసాలు జరుగుతున్నాయని ప్రజలు గుర్తించాలని కోరారు.

ఇలాంటి వారి మాయమాటలు నమ్మి అత్యాశకు పోతే భారీగా ఆర్థిక నష్టం జరుగుతుంది అన్నారు.
సైబర్ మోసగాళ్ళు కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారనీ, సైబర్ మోసాల పట్ల ప్రజల్లో అవగాహన పెరగడంతో సైబర్ మోసగాళ్లు మల్టీలెవెల్ మార్కెటింగ్ పై దృష్టి సారించి గొలుసుకట్టు వ్యాపారాల పేరుతో వాట్సప్, టెలిగ్రామ్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రకటనలు చేసి అమాయకులను ఆకర్షించి మోసగించి ఆర్థిక నష్టాన్ని కలగజేస్తారన్నారు.

మల్టీ లెవెల్ మార్కెటింగ్ ను చాలామంది విదేశాల్లో ఉండి ఒక రాకెట్ లా నడుపుతారనీ, భారీ లాభాలు తోపాటు లగ్జరీ కార్లు, ఫారిన్ టూర్ల పేరిట తమ ముఠాలతో అమాయకులకు వలపన్నుతారని ఎలాంటి మాయ మాటలు నమ్మరాదు అని ఎస్పీ తెలిపారు. అతి తక్కువ కాలంలో అధిక లాభాలు వస్తాయని ఎవరైనా చెప్తే అది మోసమని గ్రహించా అన్నారు. గొలుసుకట్టు మార్కెటింగ్ లో ముందుగా చేరిన వారికి లాభాలు వస్తాయి ఆ తర్వాత చేరిన వారంతా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.

ఇలాంటి నెట్వర్క్ లో ఎవరు చేరొద్దు ఆయా సంస్థల నిర్వాహకులు, కంపెనీలు పెట్టే సభలు, సమావేశాలకు ఎవరు వెళ్ళవద్దనీ, అనుమానాస్పద ప్రకటనలు, వెబ్ లింకులు, ఏపీకె ఫైల్స్ లాంటివి డౌన్లోడ్ చేయవద్దన్నారు. మోసపూరిత ప్రకటనలపై, ఆర్థిక మోసాలపై వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ తెలిపారు.

లేటెస్ట్

WhatsApp : వాట్సాప్ యూజర్స్ కు బిగ్ అలర్ట్.. జీరో క్లిక్ హ్యాకింగ్..!

————————————————— —-

Nalgonda : నల్గొండ జిల్లాలో భారీ చోరీ.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో 23 లక్షల బ్యాగు మాయం..!

—————————————- —————-

Rythu Bharosa : రైతు భరోసా మళ్లీ ఎప్పుడంటే.. డేట్ ఫిక్స్.. బిగ్ అప్డేట్..!

—————————– —————————–

Ration Cards : కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల పై స్పష్టం.. లేటెస్ట్ అప్డేట్..!

 

మరిన్ని వార్తలు