Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా

Paddy : క్వింటా ధాన్యంకు రూ.2389.. అదనంగా రూ.500 బోనస్..!

Paddy : క్వింటా ధాన్యంకు రూ.2389.. అదనంగా రూ.500 బోనస్..!

కంగ్టి, మన సాక్షి :

దళారుల చేతుల్లో మోసపోకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు విక్రయించాలని ఏపీఎం శ్రీనివాస్ అన్నారు. సోమవారం కంగ్టి మండల తడ్కల్, ఘనపూర్, జమ్గి కె, జమ్గి బీ గ్రామాల్లో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాలను సిసి అనుసూయ, గ్రామ పెద్దలుతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలను తరలించేటప్పుడు నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. ప్రభుత్వం ఏ గ్రేట్ ధాన్యానికి రూ.2389, బి గ్రేడ్ ధాన్యానికి రూ.2369, సన్న రకానికి బోనస్ రూ.500 నిర్ణయించినట్లు తెలిపారు.

రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ హన్మండ్లు, సిఏలు సవిత, సుమ దేవి, శ్రీపతి, గ్రామ పెద్దలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వై మల్లారెడ్డి, బాలప్ప, పెద్ద మల్లారెడ్డి, మనోహర్, తట్టి వీరేశం, ప్రవీణ్ రెడ్డి, కృష్ణారెడ్డి,

మాజీ సర్పంచ్ పండరి నాథ్ రావు, బాబూసాబ్, భాగవన్ సమీర్, సంగప్ప, హన్మండ్లు, చాకలి అంబయ్య, వివో లీడర్లు, గంగామణి, లక్ష్మి, సావిత్రి, రైతులు తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Khammam : ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర..!

  2.  District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ధాన్యం సేకరణలో అక్రమాలు, ఇద్దరు సస్పెండ్..! 

  3. TG News : రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. నేరుగా ఖాతాలలో ఎకరానికి రూ.9600..!

  4. TG News : ప్రభుత్వ పాఠశాలల్లో 2837 కంప్యూటర్ ఉద్యోగాలు.. రూ.15 వేల వేతనం, అర్హులు వీరే..!

మరిన్ని వార్తలు