Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
TGSRTC : నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ కండక్టర్..!
TGSRTC : నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ కండక్టర్..!
చిట్యాల, మన సాక్షి:
బస్సులో మర్చిపోయిన హ్యాండ్ బ్యాగ్ ను కండక్టర్ భద్రపరిచి ప్రయాణికురాలికి అప్పగించాడు. నల్గొండ నుండి భువనగిరి వెళుతున్న నార్కట్పల్లి డిపో ఆర్డినరీ బస్సులో ఎల్లారెడ్డిగూడెం నుండి చిట్యాల కు వచ్చిన ప్రయాణికురాలు బస్సులో హ్యాండ్ బ్యాగ్ ను మర్చిపోయి దిగింది. బస్సు వెళ్లిన తర్వాత చిట్యాల కార్గో నిర్వాహకుడు దశరథకు విషయం తెలియపరచగా ఆయన వెంటనే స్పందించి సమాచారం అందించాడు. కండక్టర్ కొలనుచెలిమి జంగయ్య బ్యాగును భద్రపరిచి ప్రయాణికురాలికి రామన్నపేటలో అందించాడు.
MOST READ :









