Runamafi : రుణమాఫీ కాని వారికి గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక ప్రకటన..!

Runamafi : రుణమాఫీ కాని వారికి గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక ప్రకటన..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు లక్షల రుణమాఫీ గందరగోళంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టమైన ప్రకటన జారీ చేశారు. రుణమాఫీ కానీ రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులైన వారందరికీ రుణమాఫీ వర్తిస్తుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం లాగా ఐదేళ్లపాటు రుణమాఫీ చేస్తున్నామని చెప్పి సగం మంది రైతులకు ఎగ్గొట్టారని, కానీ తమ ప్రభుత్వం అర్హులైన వారందరికీ రుణమాఫీ వర్తింప చేస్తున్నట్లు పేర్కొన్నారు.
రుణమాఫీ కానీ రైతుల వివరాలు సేకరించి క్షేత్రస్థాయిలో అధికారులు పూర్తిస్థాయి వివరాలు సేకరిస్తున్నారని తెలిపారు. ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో 2. 65 లక్షల మంది వివరాలను అధికారులు సేకరించినట్లు ఆయన వెల్లడించారు.
100% రుణమాఫీ అయినట్లు తాము ప్రకటించినట్లు ఒక విష ప్రచారానికి తెరలేపి రైతులను ఆందోళన పరుస్తున్నది బిఆర్ఎస్ నేతలు అన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతలు బుద్ధి తెచ్చుకొని అసత్య ప్రచారాలు మానుకోవాలని, వారి ప్రభుత్వ హాయంలో వడ్డీ మాఫీ చేయకుండా వదిలేసిన 22 లక్షల కుటుంబాల దగ్గరకు వెళ్లి వారికి క్షమాపణ అడిగి పాపాలను ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఆ నేతలకు సూచించారు.
రుణమాఫీ కానీ రైతుల వద్దకు వెళ్ళిన అధికారులు ప్రతి ఒక్కరికి సమాచార పత్రం ఇచ్చి అందులో కారణం పేర్కొని వాటిని సరిదిద్దే విధంగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. రుణమాఫీ కాకపోవడానికి 31 కారణాలని చెబుతున్న బీఆర్ఎస్ నేతలకు తుమ్మల నాగేశ్వరరావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
బీఆర్ఎస్ హయాంలో సగం మందికే రుణమాఫీ చేశారని 1419 కోట్ల రూపాయల రుణమాఫీ డబ్బులు తిరిగి ప్రభుత్వ ఖజానాకు వచ్చినా.. వాటిని తిరిగి రైతుల ఖాతాలకు చెల్లించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల కాలంలోనే 2,6140.13 కోట్ల రూపాయలు రైతు సంక్షేమానికి ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు.
రుణమాఫీ 2024 పథకం అమలులో ఉన్నదని, గత ప్రభుత్వంలో లాగా ఐదేళ్లు చేయమని చెప్పారు. ఆగస్టు 15 నాటి వరకు మాట ఇచ్చిన ప్రకారం సరైన వివరాలు ఉన్న రెండు లక్షల లోపు రుణాలు ఉన్న అన్ని ఖాతాలకు రుణమాఫీ వర్తింపజేశామన్నారు.
మొదటి పంట కాలంలోనే 22 లక్షల మందికి 18 వేల కోట్ల రూపాయలు ఒకే విడతలు మాఫీ చేసినట్లు తెలిపారు. కుటుంబ నిర్ధారణ కాని వాళ్లకు వ్యవసాయ అధికారులు వివరాలు సేకరిస్తున్నారని, ఇప్పటివరకు 2.65 లక్షల మంది వివరాలు సేకరించినట్లు ఆయన వెల్లడించారు. అర్హులైన వారందరికీ రుణమాఫీ వర్తింప చేస్తామని పేర్కొన్నారు.
LATEST UPDATE :
Heavy Rain : భారీ వర్షాలు.. నేడు ఆయా జిల్లాల్లో స్కూళ్లకు సెలవు..!
Nagarjunasagar : నిండుకుండలా నాగార్జునసాగర్.. 24 గేట్లు ఎత్తివేత..!
Runamafi : రుణమాఫీ పై స్పష్టత.. మాఫీ కాని వారికి ఎప్పుడంటే..!
బ్లడ్ మూన్.. ఈనెల 28న భూమి అంతం.. వణుకు పుట్టిస్తున్న సిద్ధాంతకర్తల సాక్షాలు..?
Rythu : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రైతు బీమా కోసం మొబైల్ యాప్..!










