Rythu Bharosa : రెండవ విడత రైతు భరోసా కు ముహూర్తం ఫిక్స్..!
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం యాసంగి సీజన్ మొదటి విడత నిధులు విడుదల చేయగా రైతుల ఖాతాలలో జమ అయ్యాయి. రెండవ విడత నిధులు విడుదలకు ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది.

Rythu Bharosa : రెండవ విడత రైతు భరోసా కు ముహూర్తం ఫిక్స్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం యాసంగి సీజన్ మొదటి విడత నిధులు విడుదల చేయగా రైతుల ఖాతాలలో జమ అయ్యాయి. రెండవ విడత నిధులు విడుదలకు ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది. దాంతో రైతులు సంతోషంలో ఉన్నారు. రైతు భరోసా పథకం ద్వారా రైతులకు ఎకరానికి 12 వేల రూపాయల చొప్పున రెండు సీజన్లలో అందజేస్తున్న విషయం తెలిసిందే.
యాసంగిలో పంటలు చేతికి వస్తున్నందున అంతకుముందే రైతుల ఖాతాలలో రైతు భరోసా రెండవ విడత నిధులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. యాసంగి సీజన్లో రైతు భరోసా పథకం ద్వారా మూడు విడతలుగా రైతుల ఖాతాలలో నిధులు జమ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఏప్రిల్ నెలాఖరులోగా ప్రతి రైతుకు రైతు భరోసా నిధులు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగానే మొదటి విడతలో మార్చి 23వ తేదీన రైతుల ఖాతాలలో ఒక ఎకరం చొప్పున ఒక్కొక్క రైతుకు 6000 రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 68.89 లక్షల మంది రైతులకు రైతుల ఖాతాలో డబ్బులు జమ చేశారు. మొత్తం 3446.94 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో ప్రభుత్వం జమ చేసింది.
ఇది ఇలా ఉండగా రెండవ విడత 2650 కోట్ల రూపాయలు అవసరం ఉండగా ఈనెల 22వ తేదీ లోగా రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు జమ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. కాగా మూడవ విడత రైతు భరోసానిధులను ఈ నెలాఖరులోగా రైతుల ఖాతాలలో జమ చేయనున్నారు.
ఇవీ చదవండి
- TG News : ఎమ్మెల్యేను వదలని సైబర్ మోసగాళ్లు.. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన ఎమ్మెల్యే..!
- Gold Price : పసిడి ప్రియులకు షాక్.. ఒక్క రోజులో రూ.39,800..!
- Miryalaguda : మిర్యాలగూడలో ఇటుక బట్టీల యజమానులకు జిల్లా కలెక్టర్ హెచ్చరిక, ఆకస్మిక తనిఖీ..!
- Nalgonda : నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. కరెంటు స్తంభాల లోడు ట్రాక్టర్ బోల్తా, ఇద్దరు మృతి..!









