Rythu Bharosa : రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు.. క్యాబినెట్ లో చర్చించారా..?
తెలంగాణ రైతాంగం మొత్తం రైతు భరోసా నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. మూడు నెలలుగా రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్న రైతాంగం కు క్యాబినెట్ సమావేశంలో చర్చించారా..? లేదా..? అనేది రైతాంగానికి ఆత్రుతగా ఉంది.

Rythu Bharosa : రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు.. క్యాబినెట్ లో చర్చించారా..?
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ రైతాంగం మొత్తం రైతు భరోసా నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. మూడు నెలలుగా రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్న రైతాంగం కు క్యాబినెట్ సమావేశంలో చర్చించారా..? లేదా..? అనేది రైతాంగానికి ఆత్రుతగా ఉంది.
యాసంగి సీజన్ లో ఎకరానికి 6000 రూపాయల చొప్పున అందించాల్సిన రైతు భరోసా ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా పై పలుమార్లు ప్రకటించినప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. ఆసంగి సీజన్ కూడా పూర్తి కావస్తుంది. అయినా కూడా రైతు భరోసా అందడం లేదు.
జనవరి మొదటి వారంలో అని ఒకసారి, సంక్రాంతి పండుగకు అని ఒకసారి, జనవరి నెలాఖరు అని మరోసారి, మున్సిపల్ ఎన్నికల అనంతరం వెంటనే రైతు భరోసా అందిస్తామని ప్రకటనలు మాత్రం వచ్చాయి. కానీ రైతులకు మాత్రం వారి ఖాతాలలో డబ్బులు జమ కాలేదు. ప్రభుత్వం అందించే ఈ పథకం కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఆందోళనలు ధర్నాలు సైతం చేపడుతున్నారు. ఈ పథకంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సోమవారం నిర్వహించిన తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో కనీసం రైతు భరోసా పై చర్చ కూడా కొనసాగలేదని సమాచారం. కానీ రైతులకు భరోసా ఎప్పుడు అందిస్తారనే విషయం ఇంకా స్పష్టత లేదు.