Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Suryapet : పర్యాటక ప్రాంతంగా సద్దల చెరువు..!

Suryapet : పర్యాటక ప్రాంతంగా సద్దల చెరువు..!

సూర్యాపేట, మన సాక్షి:

సూర్యాపేట పట్టణంలోని సద్దల చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దెందుకు ప్రతి పాదనలు రూపొందించాలని రాష్ట్ర పర్యాటక సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో కలిసి రాష్ట్ర పర్యాటక సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సద్దల చెరువును సందర్శించారు.

ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడుతూ సద్దల చెరువు ప్రధాన ప్రవేశం వద్ద బతుకమ్మ ఘాట్, బోటింగ్, పిల్లలకి ఆడుకునేందుకు సామాగ్రి,అలాగే జాతీయ రహదారి వద్ద ఉన్న 5 ఎకరాల స్థలంలో ప్రజలకు వినోదం కల్గించేలా పార్క్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు ఏర్పాటు చేయాలనీ అధికారులకి సూచించారు. సద్దలచెరువు బండ్ పై మొక్కలకు పోషణ లేకపోవడం చూసిన చైర్మన్ వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కమీషనర్ కు ఆదేశించారు.

పిల్లలకు,పెద్దలకు అహల్లాద వాతవరణం కనిపించాలని, పిల్లలు ఇంటిని మరచిపోయేలా ట్యాంక్ బండ్ తీర్చిదిద్దాలని చైర్మన్ ఆధికారులకు తేలిపారు.ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ అధికారి విద్యాసాగర్, ఆర్డివో వేణుమాధవ్, ఇరిగేషన్, మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

  1. ACB : సూర్యాపేట జిల్లాలో.. ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి..!

  2. MLC Kavitha : మహంకాళి ఆమ్మవారికి బోనం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత..!

  3. Railway Track : తెలంగాణలో రైలు పట్టాలపై కారుతో యువతి హల్చల్.. (వీడియో)

  4. Gold Price : కుప్పకూలిన గోల్డ్.. ఈరోజు తులం ఎంతంటే..!

  5. TG News : స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. అప్పటి లోగా నిర్వహించాలని ఆదేశాలు..!

మరిన్ని వార్తలు