Miryalaguda : సాగర్ ఎడమ కాలువ కట్ట.. రైతులకు వెన్నులో వణుకు..!

Miryalaguda : సాగర్ ఎడమ కాలువ కట్ట.. రైతులకు వెన్నులో వణుకు..!
మిర్యాలగూడ/ వేములపల్లి, మన సాక్షి:
అడుగుకొ గుంత… కళ్ళు మూసి తెరిచేలోపు ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. అద్వాన దారితో తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. అసలే వర్షాకాలం.. చిన్నపాటి వర్షానికి చిత్తడిగా మారుతున్నాయి. ఈ దారిపై నీళ్లు నిలిచి ఎక్కడ గుంట ఉందో తెలియక రైతులు ప్రమాదాలకు గురవుతున్నారు.
నల్లగొండ, సూర్యాపేట జిల్లాలలో నాగార్జునసాగర్, మిర్యాలగూడ, సూర్యాపేట, హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాలలో ఉన్న ఎడమ కాలువపై కట్టపై గుంతలు ప్రమాదకరంగా మారాయి. వేములపల్లి మండలం రావులపెంట గ్రామ శివారులో గల సాగర్ ఎడమ కాలువ కట్టపై ఏర్పడిన గుంతలు ప్రమాదకరంగా మారాయని రైతులు వాపోతున్నారు. ఈ దారి పొడవునా ఇలాంటి ప్రమాదకరమైన గుంటలు ఏర్పడ్డాయి. రైతులు వ్యవసాయ పొలాలకు వెళ్లాల్సి వచ్చినా.. పంట తీసుకుని ఇంటికి వచ్చినా.. మార్కెట్ కు వెళ్లాలన్నా.. ఈ దారినే ఉపయోగిస్తుంటారు.
ఈ దారి వెంట నిత్యం వేలమంది ప్రయాణిస్తుంటారు. ప్రస్తుతం వరి కోతల సమయం కావడంతో వరిని కోసిన రైతులు ట్రాక్టర్ల ద్వారా మార్కెట్, మిల్లులకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఈ దారి గుండా ప్రయాణించాలంటే వెన్నులో వణుకు పుడుతుందని అంటున్నారు.
ఈ ఎడమ కాలువ పరిసర ప్రాంతాల్లో కొన్ని వేల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. రావులపెంట, కామేపల్లిగూడెం , దోసపాడు, నాగులపాడు అన్నారం, తడకమల్ల తదితర గ్రామాల్లోని ప్రజలు, రైతులు ఈ పెద్ద కాలువ కట్ట పైనుండి వడ్ల లోడును తరలిస్తుంటారు. వడ్ల లోడుతో వస్తున్న ట్రాక్టర్ ప్రమాదానికి గురవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
గతంలో వడ్ల లోడుతో వెళుతున్న ట్రాక్టర్ బోల్తా పడి అందులోని వడ్లన్నీ నీటిపాలయ్యాయి. ఇలాంటి సంఘటనలు చాలాసార్లు జరిగాయి.గుంతల పై అధికారులు కు ఎలాంటి పట్టింపు లేకుండా పోయిందని.
కనీసం మరమ్మత్తులు కూడా చేయడం లేదని రైతులు వాపోతున్నారు. సంబంధిత శాఖ అధికారులు దారి అద్వానంగా మారిన పట్టించుకునే వారే కరువయ్యారని, వర్షాలకు దెబ్బతిని గుంతలు సైతం పరిశీలించడం లేదు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని పలు గ్రామాల రైతులు వేడుకుంటున్నారు.
MOST READ :
-
District Collector : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై అధికారులకు జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. టార్గెట్స్ పూర్తి చేయాలి..!
-
Bus Accident : ఘోర ప్రమాదం.. దగ్దమైన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.. 20 మందికి పైగా మృతి..!
-
TG News : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పేద ప్రజలకు మరో భారీ శుభవార్త..!
-
TG News : గిరిజన తండా టు.. ఆసియా క్రీడల వరకు ప్రయాణం..!









